ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌కు నిబంధనలు

  • Published By: vamsi ,Published On : May 16, 2019 / 03:45 AM IST
ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌కు నిబంధనలు

తీవ్రవాదంను పెంచేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోవడాన్ని అడ్డుకోవాలని కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకుంది ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌పై నిబంధనలను కఠినతరం చేసింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్ర కార్యకలాపాల కోసం ఫేస్‌బుక్‌ను వాడడంపై ఆంక్షలు విధించింది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉండే వీడియోలను ఎవరైనా ప్రసారం చేస్తే, లైవ్ స్ట్రీమింగ్ వాడకుండా నిషేధం విధిస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది.

మార్చి నెలలో న్యూజిలాండ్‌లో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ ఇస్తూ ఓ శ్వేత జాతీయుడు ఓ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా 51 మందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫేస్‌బుక్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరగగా తీవ్రవాదానికి సండబంధించిన వీడియోల లైవ్‌పై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది.