మయన్మార్‌లో ఫేస్‌బుక్ బ్లాక్.. మిలటరీ కోసమే ఇదంతా

మయన్మార్‌లో ఫేస్‌బుక్ బ్లాక్.. మిలటరీ కోసమే ఇదంతా

Myanmar దేశవ్యాప్తంగా ఫేస్ బుక్ ను బ్లాక్ చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫ్మరేషన్ ఓ లెటర్ ద్వారా మెసేజ్ ఇచ్చింది. ఫిబ్రవరి 7వరకూ ఫేస్ బుక్ సర్వీసులు అందుబాటులో ఉండవంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా.. ప్యాసింజర్ విమాన సర్వీసులను కూడా ఆపేశారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఇన్వెస్టిగేటర్లు ఫేస్ బుక్ లో ద్వేషపూరితమైన ప్రచారం జరుగుతుందని.. దీని కారణంగా హింసకు ప్రేరేపితంగా అవుతుందని పేర్కొన్నారు. దేశంలో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కాస్త ఆలస్యమైందంటూ ఫేస్ బుక్ కంపెనీ వెల్లడించింది.

మయన్మార్ లోని యూఎస్ ఎంబస్సీ వారి ఫేస్ బుక్ పేజ్ లో దేశంలోనే పెద్ద నగరమైనటువంటి యాంగావ్ కు వెళ్లేరోడ్డు క్లోజ్ అయి ఉందని రాసుకొచ్చింది. ఆ దేశంలోని ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకుని ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయాలకు దారితీశాయి.

కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ సంక్షోభంతో ప్రభుత్వం రద్దు అయింది. ఆ రద్దయిన ప్రభుత్వం కూడా ఫేస్ బుక్ ద్వారా తమ నిర్ణయాలను వెల్లడించింది. సైన్యంపై వ్యతిరేకత ప్రబలకూడదనే ముందుచూపుతో ఎఫ్బీ బ్లాక్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.