Pakistan : కడుపులోని ఆడబిడ్డని మగబిడ్డగా మార్చేస్తానంటూ గర్భిణి తలలో మేకు దించిన బాబా!

గర్భిణి కడుపులో పెరిగే ఆడబిడ్డని మగపిల్లాడిగా మార్చేస్తానంటూ గర్భిణి తలలో మేకు దించాడు ఓ బాబా..ఆ తరువాత ఆమె పరిస్ధితి..

Pakistan : కడుపులోని ఆడబిడ్డని మగబిడ్డగా మార్చేస్తానంటూ గర్భిణి తలలో మేకు దించిన బాబా!

Pakistan Fake Baba Drills Nail Into Pregnant

Pakistan Fake baba drills nail into pregnant : టెక్నాలజీ వైద్య శాస్త్రంలో పెను మార్పులు చేస్తు ప్రాణాల్ని కాపాడుతున్నారు డాక్టర్లు. ఎన్ని క్లిష్టమైన ఆపరేషన్లు చేస్తు రోగులకు పునర్జన్మనిస్తున్నారు. కానీ..ఆడపిల్ల కావాలంటే ఆడపిల్లా..కాదు మగపిల్లాడే పుట్టాలని కోరుకునేవారికి మగపిల్లాడే పుట్టేలా మాత్రం చేయలేకపోతున్నారు. ఇది వైద్యశాస్త్రంలో కూడా సాధ్యం కాదనే విషయం డాక్టర్లకు తెలుసు. కానీ ఓ నకిలీ బాబా మాత్రం సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తానంటూ ఓ గర్భిణి ప్రాణాలమీదకు తెచ్చాడు. గర్భంలో పెరిగే ఆడపిల్లను మగపిల్లాడిగా మార్చేస్తానంటూ గర్భిణి ప్రాణాలమీదకు తెచ్చిన ఘటన పాకిస్థాన్ లోని పెషావర్ లో చోటుచేసుకుంది. ఆమె కడుపులో పెరిగేది ఆడపిల్లో మగపిల్లాడో కూడా తెలియని ఆ మాయగాడు మగపిల్లాడు పుట్టేలా చేస్తానని చెప్పిన మాటలు నమ్మిన సదరు బాధితురాలు..తలలో మేకు దింపించుకుంది..!!

Also read : మగబిడ్డ పుట్టాలని 4 ఏళ్ల మగపిల్లాడిని బలి ఇచ్చిన అత్తాకోడళ్లు

పెషావర్‌కు చెందిన ఓ మహిళళకు వివాహం తరువాత వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లాడి కోసం..భర్త ఇంటిలో భర్త అత్తమామల ఒత్తిడి పెరిగింది. ఈసారి అయినా మగపిల్లాడు పుట్టకపోతే విడాకులు ఇచ్చేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో ఆమె మగపిల్లాడి కోసం మరోసారి గర్భం దాల్చింది. నెలలు నిండుతున్న కొద్దీ మరోసారి ఆడపిల్లే పుడుతుందనే ఆందోళన ఆమెలో పెరుగుతోంది. ఎలాగైనా ఆసారి మగపిల్లాడు పుట్టాలని దేవుడికి మొక్కుకుంటోంది. ఈ ఆందోళనతో ఆమెలో తన గర్భంలో పెరిగేది ఆడపిల్లేనేమో అనే మానుమానం పెరుగింది.

Also read : Abortions: మగబిడ్డ కోసం 8 అబార్షన్లు.. 1500 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించిన భర్త

ఈసారి అయినా మగపిల్లాడు పుట్టకపోతే అబ్బాయి పుట్టకుంటే వదిలిపెట్టేస్తానని భర్త బెదిరింపులే ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశాయి. వారాలు గడుస్తున్నకొద్దీ ఆమెలో మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనని తీవ్ర భయాందోళనలు పెరుగుతునే ఉంది. దీంతో ఈ గండం నుంచి బయటపడేందుకు పరిపరి విధాల ఆలోచించింది. ఈ క్రమంలో ఓ బాబా గురించి తెలుసుకుంది. అతని వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. అంతా విన్న ఆ బాబా‘నీకేం భయంలేదు..నీ కడుపులో ఆడపిల్ల పెరుగుతున్నా సరే ..ఆ శిశువును మగబిడ్డగా మార్చేస్తాను’అంటూ అభయం ఇచ్చేశాడు. గతంలో తాను ఇలా చాలామందికి మగబిడ్డ పుట్టేలా చేశానని చెప్పుకొచ్చారు. తనకున్న పరిస్థితుల్లో ఆ మాయగాడి మాటలు పూర్తిగా నమ్మింది ఆమె.

Also read : Karnataka crime : పురాతన ఇంట్లో గుప్తనిధుల కోసం..స్త్రీని నగ్నంగా కూర్చోపెట్టి క్షుద్రపూజలు..

కానీ బాధతో కూడుకుంది అని చెప్పాడు.అయినా ఫరవాలేదంది. అలా ‘ఓ మేకును నువ్వు తలలో కొట్టించుకుంటే కడుపులో పెరిగేది ఆడపిల్ల అయినా సరే మగపిల్లాడిగా మారిపోతుంది’’అని చెప్పాడు. దానికి ఆమె సరేనంది. అతడి మాయ మాటలపై పూర్తిగా నమ్మిన సరదు గర్భిణి తలపై మేకు కొట్టించుకునేందుకు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే ఓ మంచి ముహూర్తం కూడా పెట్టి ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే ‘గర్భిణి తలలోకి మేకు దిపింపాడు. అలా ఆ మేకు కాస్త లోపలకు దిగగానే బాధతో విలవిల్లాడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు మేకును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వెంటనే పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడామెకు పరీక్షలు చేసిన వైద్యులు మేకు పుర్రెను చీల్చుకుని వెళ్లిందని చెప్పారు.కానీ ఆ మేకు మెదడును తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆమేకును తీసివేశారు. అసలు తలలోకి మేకు ఎలా వెళ్లిందని డాక్టరు ఆమె కుటుంబ సభ్యుల్ని అడిగారు. దానికి జరిగిన విషయం చెప్పగా డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఏంటీ మతిలేని పనులు..మేకు మెదడులోకి దిగితే ఆమె చనిపోయి ఉండేదని తీవ్రంగా తిట్టిపోశారు.

Also read :  వారసుడొచ్చాడు : మగపిల్లాడి కోసం 12 కాన్పులు
గర్భిణి తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా..ఈ ఘటనపై డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ బాబాను అరెస్ట్ చేయటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన సదరు మాయగాడు పరారయ్యాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.