Karnataka crime : పురాతన ఇంట్లో గుప్తనిధుల కోసం..స్త్రీని నగ్నంగా కూర్చోపెట్టి క్షుద్రపూజలు..

పురానత ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని క్షుద్రపూజలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. .పూజల్లో స్త్రీని నగ్నంగా కూర్చోపెడితే గుప్త నిధులు కనిపిస్తాయని నమ్మించి..

Karnataka crime : పురాతన ఇంట్లో గుప్తనిధుల కోసం..స్త్రీని నగ్నంగా కూర్చోపెట్టి క్షుద్రపూజలు..

Witchcraft  In Karnataka Old House

witchcraft  in Karnataka old house : కొన్ని పరిచయాలు మనల్ని సమస్యల నుంచి తప్పిస్తే..మరికొన్ని పరిచయాలు లేని కష్టాల్ని సృష్టించుకుని సమస్యల్లో పడేలా చేస్తాయి. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది.ఓ పెళ్లిలో పరిచయం అయిన వ్యక్తి వల్ల నానా పాట్లు పడి పోలీసుల కేసులో ఇరుక్కునేలా చేసింది.కర్ణాటకలోని భూనహళ్లికి చెందిన వ్యవసాయదారుడు శ్రీనివాస్. అతనికి ఓ పురాతన ఇల్లు ఉంది. 75 సంతవ్సరాల క్రితం కట్టిన ఇల్లు శ్రీనివాస్ కు వారసత్వంగా వచ్చింది. ఆ ఇంటిలోనే శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.ఈ క్రమంలో శ్రీనివాస్ బంధువుల ఇంటిలో పెళ్లి ఉంటే కుటుంబంతో సహా వెళ్లారు. ఆ పెళ్లిలో శ్రీనివాస్ కు పెళ్లిలో పూజలు చేసే షాహికుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరు తరచు కలుస్తుండేవారు. వారి మాటల సందర్భంలో తనకు 75 ఏళ్లనాటి ఇల్లు ఉందని చెప్పాడు శ్రీనివాస్. దాంతో షాహికుమార్‌..మీ ఇల్లు చూడాలని ఉంది అని అడగటంతో శ్రీనివాస్‌ తన ఇంటికి తీసుకొచ్చాడు.

ఆ ఇల్లు చూసిన షాహికుమార్ మీ ఇల్లు చాలా పురాతన కాలంనాటి ఇల్లు కదా..ఈ ఇంటిలో గుప్తనిధులు ఉంటాయని..నీ పూర్వీకులు నీకోసం అవిదాచి పెట్టారని వాటిని బయటకు తీయకపోతే కష్టాల్లో పడతావని శ్రీనివాస్ ను నమ్మించాడు.భయపెట్టాడు. షాహికుమార్ మాటలు నమ్మిన శ్రీనివాస్ వాటిని బయటకు తీసే మార్గం చెప్పమని అడిగాడు. దానికి పూజలు చేయాలి..ఖర్చు అవుతుందని చెప్పాడు. సరేనన్నాడు శ్రీనివాస్.

పూజల కోసం షాహికుమార్ కు రూ.20వేలు అడ్వాన్స్ ఇచ్చాడు శ్రీనివాస్. కానీ కరోనా అంటూ ఆలస్యం చేశాడు. లాక్‌డౌన్‌లతో పని వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు శ్రీనివాస్‌ని కలసి పని ప్రారంభిస్తానని చెప్పాడు. అలా పని ప్రారంభించాడు. గప్త నిధుల కోసం పూజలు చేయటానికి ఆ పాతకాలం నాటి ఇంటిలోని ఓ రూమ్ ను ఎన్నుకున్నాడు. పసుపు, కుంకుమ,నిమ్మకాయలు వంటివి సిద్ధం చేసి నానా హడావిడి చేశాడు. తరువాత గుప్త నిధులు కనిపించాలంటే నా ముందు ఓ స్త్రీని నగ్నంగా కూర్చోపెట్టాలని..అదికూడా నీ కుటుంబంలోని అమ్మాయే నగ్నంగా కూర్చోవాలని చెప్పాడు.

అది విన్న శ్రీనివాస్ షాక్ అయ్యాడు. కానీ మ్యానేజ్ చేద్దామనుకున్న శ్రీనివాస్‌ కూలిపనులకు వెళ్లే ఓ మహిళకు రూ.5000 ఇచ్చి ఒప్పించి తీసుకువస్తాడు. అక్కడివ వరకు అంతా బాగానే జరిగింది. కానీ శ్రీనివాస్, షాహి కుమార్ కలిసి తిరుగుతుండటం..ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారనే చుట్టుపక్కల వారు అనుమానించారు. దీంతో వారిపై ఓ కన్నేసి ఉంచారు.

అలా పూజకు అన్ని సిద్ధమయ్యాక స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పూజలు చేసే షాహికుమార్‌ అతని అసిస్టెంట్ మోహన్ అనే మరో వ్యక్తితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల చొరవతోనే కూలి మహిళను, ఆమె నాలుగేళ్ల కూతురును రక్షించారు పోలీసులు. అలా గుప్త నిధుల కోసం ఆశపడిన శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో ప్రశాంతంగా పాత ఇంట్లో నివసించే శ్రీనివాస్ పోలీసుల పాలయ్యడు.