FBI raids on Trump’s home: ట్రంప్ ఇంటి నుంచి రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచి ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సెర్చ్ వారెంట్ ద్వారా తెలిసింది. ఫ్లోరిడాలోని పాం బీచ్‌లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఇటీవల ఎఫ్‌బీఐ ఏజెంట్లు భారీగా వెళ్ళి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు అధికారిక పత్రాల దుర్వినియోగం కేసులో ఈ సోదాలు జరిగాయి.

FBI raids on Trump’s home: ట్రంప్ ఇంటి నుంచి రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు

FBI raids on Trump home

FBI raids on Trump’s home: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి నుంచి ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సెర్చ్ వారెంట్ ద్వారా తెలిసింది. ఫ్లోరిడాలోని పాం బీచ్‌లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఇటీవల ఎఫ్‌బీఐ ఏజెంట్లు భారీగా వెళ్ళి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు అధికారిక పత్రాల దుర్వినియోగం కేసులో ఈ సోదాలు జరిగాయి.

సోదాల్లో ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకున్న పత్రాల గురించి తాజాగా పలు కీలక వివరాలు బయటకు వచ్చాయి. ట్రంప్ ఇంటి నుంచి ఎఫ్‌బీఐ అధికారులు 11 సెట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అమెరికా జాతీయ భద్రతకు హాని కలిగించే పత్రాలు కూడా ఉన్నాయని తెలిసింది. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ అంటున్నారు. నేరపూరిత ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు జరగడం ఇదే మొట్టమొదటి సారి. ట్రంప్ మినహా అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఎవరి ఇంట్లోనూ ఇటువంటి సోదాలు జరగలేదు.

ఆయా పత్రాలను నిన్న అధికారులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ట్రంప్ ఇంటి నుంచి మొత్తం 20 బాక్సులకు పైగా పత్రాలు, ఫొటోలను స్వాధీనం చేసుకుని సీల్ చేశారు. వాటిలో ఫొటో బైండర్, చేతి రాతతో ఉన్న లేఖలు, ఇతర పత్రాలు ఉన్నాయి. చట్టాలను ఉల్లంఘిస్తూ అధికారిక పత్రాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని అధికారులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ 2024 అమెరికా అధ్యక్షుడి ఎన్నిక బరిలో నిలవాలని భావిస్తున్న సమయంలో సోదాలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.

Weather alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం