Journalist Jailed: కరోనాపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్.. ఇప్పుడు చావుబతుకుల మధ్య జైల్లో ఉంది!

కరోనా సమాచారం బహిర్గతం చేయడంతో ఓ మహిళ జర్నలిస్టులు ఆ దేశ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించింది

Journalist Jailed: కరోనాపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్.. ఇప్పుడు చావుబతుకుల మధ్య జైల్లో ఉంది!

Prison

Prison : చైనాలో గతేడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.. తమ దేశంలోని కరోనా సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలియకుండా కట్టడి చేసింది. జర్నలిస్టులపై నజర్ వేసింది.. దేశంలోని కరోనా సమాచారం బయటకు వెళ్తే కఠిన శిక్షలు తప్పవని జర్నలిస్టులను హెచ్చరించింది. అయితే కొందరు దైర్యం చేసి చైనాలోని కరోనా దుర్భర పరిస్థితిని సరిహద్దులు దాటించారు. ఆలా చేసిన వారిని చైనా ప్రభుత్వం జైల్లో పెట్టింది.

చదవండి : India China Boarder: చైనా సరిహద్దుల్లో చినూక్ హెలికాఫ్టర్లు!

2020 ఫిబ్ర‌వ‌రిలో జ‌ర్న‌లిస్టు జాంగ్ జాన్ వుహాన్‌కు వెళ్లి అక్క‌డ క‌థ‌నాలు రాశారు. స్మార్ట్‌ఫోన్ వీడియోల ద్వారా మ‌హ‌మ్మారిపై అధికారుల్ని నిల‌దీశారు. దీంతో ఆమెను గతేడాది మేలో జైల్లో వేసింది చైనా ప్రభుత్వం. అయితే ప్ర‌స్తుతం జాంగ్ ఆరోగ్యం బాగా క్షీణించింద‌ని, బ‌రువు కోల్పోయింద‌ని, ఇక ఆమె ఎక్కువకాలం బ్ర‌త‌క‌లేద‌ని సోద‌రుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

చదవండి : China Vaccination for Above 3 Years : మూడేళ్ల చిన్నారులకు టీకా వేసేందుకు చైనా ప్రయత్నాలు

రాబోయే శీతాకాలంలో ఆమె ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉన్న‌ట్లు జాంగ్ సోద‌రుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న సోద‌రిని రిలీజ్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమ్నెస్టీని జాంగ్ జూ వేడుకున్నారు. అయితే ఆమె గత కొంతకాలంగా నిరాహార దీక్ష చేస్తోంది. దీంతో ఆమె ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షిణించింది. ప్రస్తుతం ముక్కు ద్వారా ఆమెకు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. షాంఘై మ‌హిళా జైలులో ఉన్న ఆమెను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించినా.. అధికారుల అనుమ‌తి ద‌క్క‌డం లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.