flood In US : ప్రకృతి కన్నెర్ర..అప్పుడు మంచు ఇప్పుడు వరదలతో వణుకుతున్న అమెరికా.. వరదలతో కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్ అతలాకుతలం

అమెరికాపై మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. మొన్న మొన్నటి వరకు మంచు ఇప్పుడు వరదలతో వణుకుతోంది అమెరికా.. వరదలతో కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్ అతలాకుతలంగా మారాయి.హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే.. మాంటెసిటో నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయ్.

flood In US : ప్రకృతి కన్నెర్ర..అప్పుడు మంచు ఇప్పుడు వరదలతో వణుకుతున్న అమెరికా.. వరదలతో కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్ అతలాకుతలం

flood In US

flood In US : అమెరికాలో కాలిఫోర్నియా.. భారత్‌లో జోషిమఠ్.. గట్టిగా వర్షం పడితే.. ముంబై మునిగిపోతుంది. కాస్త ఎక్కువ వరదలొస్తే.. బెంగళూరు కనిపించదు. హైదరాబాద్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రకృతి కన్నెర్రజేస్తే.. విలయం ఇలాగే ఉంటుందా? నేచర్‌కి విరుద్ధంగా ఏం చేసినా.. ఫ్యూచర్‌లో విధ్వంసం తప్పదా? ప్రపంచంలో.. ఏదో ఒక చోట తలెత్తుతున్న విపత్తులు సూచిస్తున్నదేంటి? ఇప్పటికైనా మేల్కొనకపోతే.. ఊహించని విలయం చూడటం ఖాయమా?

మొన్నటిదాకా మంచు తుపానుతో గజగజ వణికిన అగ్రరాజ్యం అమెరికాను.. ఇప్పుడు భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయ్. వరదల ధాటికి.. యూఎస్‌లోని కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్ అతలాకుతలమైపోయాయ్. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. కీలక ఏరియాలన్నీ మునిగిపోయాయ్. కాలిఫోర్నియాలో అయితే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ.. 90 శాతం మంది జనాభా బురద ముప్పులో చిక్కుకున్నారు. భీకర వరదల కారణంగా.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని దాదాపు 25 వేల మందిని అమెరికా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇక.. హాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే.. మాంటెసిటో నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయ్. మున్ముందు.. మరింత భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బురద విరుచుకుపడి.. లగ్జరీ ఇళ్లను, అపార్ట్‌మెంట్లను ముంచెత్తే ప్రమాదముందని భావిస్తున్నారు. అందువల్ల.. మాంటెసిటోలో ఉన్న వాళ్లంతా.. సిటీని వీడాలని.. ఎమర్జెన్సీ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే.. ఆ నగరంలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోకి.. బురద ప్రవాహం కూడా భారీగా పెరిగింది. అటు హాలీవుడ్ కమెడియన్ ఎల్లెన్ కూడా అక్కడ నెలకొన్న వరద పరిస్థితులపై ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతం నుంచి తప్పకుండా తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

లాస్ఏంజిల్స్‌కు సమీపంలో ఉండే మాంటెసిటో నగరంలో.. అనేక మంది ప్రముఖులు నివసిస్తుంటారు. వీరిలో.. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతులతో పాటు పాపులర్ యాంకర్ ఓప్రా, ఫేమస్ యాక్టర్స్ జెన్నిఫర్ అనిస్టన్, ల్యారీ డేవిడ్, పాప్ సింగర్ కేటీ పెర్రీ, రాబ్ లోవ్, గినెత్ పాల్ట్రోతో పాటు అమెరికా వినోద రంగానికి చెందిన అనేక మంది ఇక్కడే ఉంటున్నారు. వరదల ధాటికి చాలా మంది ఇళ్లలోకి నీరు, బురద చేరింది. సింపుల్‌గా చెప్పాలంటే.. వాళ్లుంటున్న ఏరియా అంత జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది.

నిజానికి.. కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ అనేవి అమెరికాలో చాలా కాస్ట్‌లీ ఏరియాలుగా చెబుతుంటారు. అక్కడ ఉండే ఫెసిలిటీస్, లగ్జరీ విల్లాలు, అపార్ట్‌మెంట్లు.. మిగతా అమెరికాలో ఎక్కడ చూసినా అంతగా అనిపించవు. కానీ.. వరదల దెబ్బకు.. అవన్నీ బురదకొట్టుకుపోయాయ్. నిన్నమొన్నటిదాకా.. లగ్జరీగా బతికిన వాళ్లంతా.. ఇప్పుడు అక్కడి నుంచి తరలివెళ్లి.. ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. పైగా.. మాంటెసిటో లాంటి సెలబ్రిటీలు ఉండే ఏరియాకు కూడా వరద ఎఫెక్ట్ తప్పలేదు. ప్రముఖులు, సెలబ్రిటీలు తాము ఎక్కడ ఉండాలనే దానిపై.. అనేక విధాలుగా ఆలోచిస్తారు. ప్రశాంత వాతావరణంతో పాటు ఓన్ హౌజ్‌లో ఉన్నా.. ఫామ్ హౌజ్‌లో ఉన్న ఫీలింగ్ రావాలని కోరుకుంటారు. చుట్టూ పచ్చదనంతో పాటు అన్ని రకాల వసతులు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఏరియాను సెలక్ట్ చేసుకొని మరీ.. అక్కడే లగ్జరీ విల్లాలు కట్టుకొని నివసిస్తుంటారు. కానీ.. చాలా వరకు ఆ ప్రాంతమంతా ఇప్పుడు వరదనీటిలో చిక్కుకుపోయింది. కోట్లకు కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లన్నీ.. ఇప్పుడు నీళ్లలో పడవల్లా తేలిపోతున్నాయ్. ఎంతో గొప్పగా బతికిన సెలబ్రిటీలు కూడా ఇప్పుడు తాముంటున్న ఏరియాను వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ్.

అంతేకాదు.. కాలిఫోర్నియాలో 17 ప్రాంతాల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే.. స్థానికంగా ఉన్న స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కొన్ని ఏరియాల్లో భారీ చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో.. కరెంటు సప్లై కూడా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో.. కొన్ని చోట్ల రోడ్లు కూడా కొట్టుకుపోయాయ్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇంతకుముందు అక్కడున్న పరిస్థితులన్నీ.. బాంబ్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత.. మొత్తం మారిపోయాయ్. రోడ్లకు రోడ్లు కుంగిపోవడం.. వాటిలో కార్లు పడిపోవడం లాంటి దృశ్యాలు, ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయ్. కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్‌లో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. వరద ప్రవాహం కూడా మామూలుగా లేదు. పైగా.. కాలిఫోర్నియాపై పగబట్టినట్లుగా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో.. ఈ స్థాయిలో వర్షాలు కురుస్తాయని.. అవి వరదల్లా మారతాయని.. ఇంత బీభత్సం సృష్టిస్తాయని.. అమెరికా అస్సలు ఊహించలేదు.