మగాళ్ల క్రికెట్ జట్టుకు మహిళా కోచ్‌

మగాళ్ల క్రికెట్ జట్టుకు మహిళా కోచ్‌

Sarah Taylor Will Work With Men Team

Sarah Taylor will work with men team : అన్ని రంగాల్లోను రాణించే మహిళలు క్రీడల్లో కూడా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కేవలం పురుషుల మాత్రమే ఆడే ఆటల్లో కూడా తమ సత్తా చూపిస్తున్నారు. దేంట్లోనూ మేం తీసుపోం అంటున్నారు. ఆకాశంలో కూడా గెలుపు సంతకాలు చేస్తున్నారు. మహిళల ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో పురుషుల క్రికెట్ జట్టుకు మహిళా కోచ్‌గా సారా టేలర్ ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేయనున్న తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు.

3

ఇంగ్లాండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ అరుదైన రికార్డును దక్కించుకున్నారు. తొలిసారి పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనున్నారు సారా టేలర్. సారా సాధించిన మరో ఘనత ఏమిటంటే..పురుషులతో కలిసి అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడిన మొదటి మహిళా క్రికెటర్‌ కూడా సారాయే కావడం గమనించాల్సిన విషయం.

Sara 2

ఇంగ్లాండ్‌ మహిళ జట్టు తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా టేలర్‌ 2019లో క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించారు సారా టేలర్. సుదీర్ఘ ఫార్మాట్లో 300, వన్డేల్లో 4,056, టీ20ల్లో 2,177 పరుగులు సాధించారు సారా టేలర్.

9

అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టంపింగ్స్‌, 128 క్యాచులు అందుకున్న అరుదైన అదర్భుతమైన మహిళ సారా టేలర్. 2017లో జరిగిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్‌ గెలవడంలో సారా కీలక పాత్ర పోషించారు.

6

మానసిక ఆరోగ్య సమస్యలతో 30 ఏళ్లకే ఆటకు దూరమైన సారా ఈస్ట్‌బౌర్న్‌లోని ఓ స్కూల్లో స్పోర్డ్స్, లైఫ్‌ కోచ్‌గా పనిచేశారు. ససెక్స్‌ మెంటల్‌ హెల్త్‌, వెల్‌బీయింగ్‌ హబ్‌ను నెలకొల్పేందుకు సారా చేసిన కృషి అద్వీతీయమైనది చెప్పాలి.

4

ఐసిసి ఉమెన్స్ టి 20 ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – 2012, 2013,2018, ఐసిసి మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – 2014 అవార్డులు గెలుచుకున్న మహిళా మణిపూస సారా టేలర్. తొలిసారి పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికై ఇంగ్లాండ్‌ మాజీ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యయనానికి నాంది పలికారు. కాగా..ఆమె ప్రతిభతో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదని గతంలో ఓసారి సారా వెల్లడించారు. దీంతో ఆమె అభిమానులు ఆమె ఆటను మరోసారి ఆస్వాదించవచ్చని ఆశిస్తున్నారు.