Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. ఇమ్రాన్ ఖాన్‌కు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. ఇమ్రాన్ ఖాన్‌కు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ గాయపడ్డారు. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్‌తోపాటు క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో ఆయన మేనేజర్‌తోపాటు ఇతర అనుచరులు కూడా గాయపడ్డారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.