కరోనా సెకండ్ వేవ్, ఫ్రాన్స్ లో మళ్లీ లాక్ డౌన్

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 10:32 AM IST
కరోనా సెకండ్ వేవ్, ఫ్రాన్స్ లో మళ్లీ లాక్ డౌన్

france announces second lockdown : కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా అత్యధిక మరణాలు నమోదు కావడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెండోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రొన్‌ ప్రకటించారు. అత్యవసర సర్వీసులకు మినహా ప్రజలు బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు.



కరోనా మహమ్మారి ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 35, 540 మందిని బలి తీసుకుంది. నవంబరు 15 నాటికి సుమారు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే సమీప కాలంలో 4 లక్షలకు పైగా అదనపు మరణాలు నమోదయ్యే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు.



లాక్‌డౌన్‌ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని, క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు కుటుంబాలతో కలిసి జరుపుకొనే పరిస్థితులు రావాలని మాక్రాన్‌ ఆకాంక్షించారు.



మరోవైపు జర్మనీ కూడా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది… జర్మనీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గతంలో ఉన్నడూ లేని విధంగా 4,49,964కి చేరుకుంది. దీంతో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్‌ దేశంలో ఉన్న పదహారు రాష్ట్రాల గవర్నర్లు, కీలక ప్రభుత్వ విభాగాల అధినేతలతో సమావేశమయ్యారు. కరోనా ఉదృతిని ఆపేందుకు ఏం చేయాలనే అంశంపై చర్చించారు. పాక్షిక లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపారు.



ప్రజలు సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కొంత కాలం ఆన్ లైన్‌లోనే క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలకు సూచించారు. లాక్‌ డౌన్‌ కారణంగా పర్యాటక రంగం భారీగా నష్టపోయిందని బార్లు, రెస్టారెంట్ల యజమానులు అంటున్నారు. లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వారు సిద్ధమయ్యారు.