India-Germany: పుతిన్ ను సమర్ధించిన జర్మన్ నేవీ చీఫ్ “రాజీనామా”

భారత పర్యటనకు వచ్చిన జర్మనీ నేవీచీఫ్ కే-అచిమ్ స్కోన్‌బాచ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను సమర్దించడంపై యూరోప్ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో నేవీచీఫ్ బాధ్యతల నుంచి వైదొలిగారు

India-Germany: పుతిన్ ను సమర్ధించిన జర్మన్ నేవీ చీఫ్ “రాజీనామా”

Kay Achim

India-Germany: భారత పర్యటనకు వచ్చిన జర్మనీ నేవీ చీఫ్ కే-అచిమ్ స్కోన్‌బాచ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను సమర్దించడంపై యూరోప్ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరైన పంథాను వ్యవహరిస్తున్నారని, అందుకు ఆయనకు “గౌరవం ఇవ్వడంలో తప్పులేదంటూ” భారత పర్యటన సందర్భంగా కే-అచిమ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు యూరోప్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. కే-అచిమ్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జర్మన్ రాయబార కార్యాలయాన్ని వివరణ కోరింది. కే-అచిమ్ భారత్ నుంచి బయలుదేరి జర్మనీ చేరుకునే సమయానికే అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి. దీంతో నేవీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు కే-అచిమ్ ప్రకటించారు.

Also read: India-Germany: భారత పర్యటనలో పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జర్మన్ నేవీ చీఫ్

కే-అచిమ్ రాజీనామాను జర్మనీ రక్షణ మంత్రి క్రిస్టిన్ లాంబ్రెచ్ట్ వెనువెంటనే ఆమోదించి ఆ స్థానంలో ప్రస్తుత డిప్యూటీ చీఫ్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు. ఇక తన రాజీనామాపై కే-అచిమ్ స్పందిస్తూ..తాను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఈ వ్యవహారానికి ఇంతటితో చెక్ పెట్టేందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కే-అచిమ్ ను రాజీనామా వెనుక జర్మనీ ప్రభుత్వ ఒత్తిడి లేదని, వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా..మిగతా నాటో సభ్యులతో కలిసి ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగుతుందని జర్మనీ పేర్కొంది. అయితే సమస్యను మరింత జఠిలం చేయకుండా మారణాయుధాలు సరఫరా చేయబోమని బెర్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి.

Also read: Corona Vaccine: కోవిడ్ వాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు