Aman Pandey : లోపాలు పట్టాడు, రూ.65 కోట్లు సాధించాడు.. భారతీయ యువకుడి ఘనత

భారత్ కు చెందిన యువకుడు తన టాలెంట్ తో సత్తా చాటాడు. ఏకంగా అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి రూ.65 కోట్ల రివార్డ్ అందుకున్నాడు.

Aman Pandey : లోపాలు పట్టాడు, రూ.65 కోట్లు సాధించాడు.. భారతీయ యువకుడి ఘనత

Aman Pandey

Aman Pandey : భారత్ కు చెందిన యువకుడు తన టాలెంట్ తో సత్తా చాటాడు. ఏకంగా అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి అరుదైన అభినందన అందుకున్నాడు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా? లోపాలు గుర్తించాడు.. ఏకంగా రూ.65 కోట్లు అందుకున్నాడు. గూగుల్ కు చెందిన వివిధ ప్రొడ‌క్ట్‌ల సాఫ్ట్ వేర్ లో భారీ ఎత్తున లోపాలను (బ‌గ్స్‌) గుర్తించాడు. అందుకుగాను ఒక్క ఏడాదిలోనూ రూ.65 కోట్లు రివార్డ్‌ అందుకున్నాడు.

భార‌త్‌కు చెందిన అమ‌న్ పాండే ఎన్ఐటీ భోపాల్ లో ప‌ట్ట‌భ‌ద్రుడ‌య్యాడు. అనంత‌రం ప్ర‌ముఖ కంపెనీల‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ల‌లో లోపాల్ని గుర్తించేందుకు గతేడాది బ‌గ్స్ మిర్ర‌ర్ పేరిట కంపెనీని స్థాపించాడు. ఈ నేప‌థ్యంలో గూగుల్ త‌మ సంస్థ‌లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ల‌లో లోపాల్ని గుర్తించిన వారికి భారీ ఎత్తున ప్రోత్సాహ‌కాల్ని అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఇందుకోసం వ‌ల్న‌ర‌బిల‌టీ రివార్డ్ ప్రోగ్రామ్ 2021 ను నిర్వ‌హించింది.

Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?

ఇందులో పాల్గొన్న అమ‌న్ పాండే.. గూగుల్, ఆండ్రాయిండ్‌, గూగుల్ క్రోమ్‌, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు ఇత‌ర ప్రొడ‌క్ట్‌ల‌లో వంద‌ల సంఖ్య‌లో బ‌గ్స్‌ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థ‌కు చెందిన మిగిలిన కంపెనీల‌కు చెందిన ప‌లు సాఫ్ట్‌వేర్‌ల‌లో మొత్తం 232 లోపాల్ని గుర్తించాడు. ఈ నేప‌థ్యంలో అమ‌న్‌ను గూగ‌ల్ ప్ర‌త్యేకంగా అభినందించింది. బ‌గ్స్ ను గుర్తించినందుకు రూ.65కోట్ల రివార్డ్‌ను అందిస్తున్న‌ట్లు గూగుల్ ప్రకటించింది.

Jagananna Chedodu Scheme : రూ.10వేలు రాలేదా? మార్చి 11లోపు ఇలా చేయండి…

కాగా, 2019లో సారా జాకోబస్ అనే వ్యక్తి ఆండ్రాయిడ్‌ వల్నరబిలిటీస్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 280కి పైగా బ‌గ్స్‌ను నివేదించి తొలిస్థానంలో నిలిచాడు. కేవలం భారతీయ పరిశోధకుడికే కాకుండా సైబర్‌ ప్రమాదాల నుంచి గూగుల్‌ను సురక్షితంగా ఉంచడంలో సహకరించిన మొత్తం పరిశోధన సంఘానికి కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు దాదాపు ప్రతి టెక్‌ కంపెనీ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంటుంది. దీని ద్వారా తమ సాఫ్ట్‌వేర్‌లలో లోపాలు (బగ్స్‌)ను కనిపెట్టి, తెలియజేసిన భద్రతా పరిశోధకులకు కంపెనీ రివార్డులు ప్రకటిస్తుంది.