Gotabaya Rajapaksa: అమెరికానే కరెక్ట్.. అమెరికాలో స్థిరపడేందుకు గొటబయ రాజపక్సే ప్రయత్నాలు.. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు ..

: ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుంచి పారిపోయిన విషయం విధితమే. ఆయన సింగపూర్‌లో కొద్దికాలంగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు థాయ్ లాండ్ వచ్చినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది.

Gotabaya Rajapaksa: అమెరికానే కరెక్ట్.. అమెరికాలో స్థిరపడేందుకు గొటబయ రాజపక్సే ప్రయత్నాలు.. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు ..

Sri Lanka's deposed president:

Gotabaya Rajapaksa: ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుంచి పారిపోయిన విషయం విధితమే. ఆయన సింగపూర్‌లో కొద్దికాలంగా ఉండి అక్కడి నుంచి ఇప్పుడు థాయ్ లాండ్ వచ్చినట్లు శ్రీలంక మీడియా పేర్కొంది. అయితే గొటబయ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన యూస్ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవటం కూడా జరిగిందని శ్రీలంక మీడియా తెలిపింది.

Gotabaya Rajapaksa: గొటబయ రాజపక్స పారిపోలేదు.. శ్రీలంకకు తిరిగి వస్తున్నారట.. ఎప్పుడంటే?

అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేయడం వెనుక ఓ కారణముందంట. ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఉన్న గొటబయ ఆయనకు రెండు నుంచి మూడు నెలలు వరకే ఆ దేశంలో ఉండేందుకు అనుమతి ఉంది. ఆ తరువాత దేశం విడిచి వెళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక వచ్చే పరిస్థితి లేదు. దీంతో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడితే బాగుంటుందని కుటుంబ సభ్యులు సూచనలతో గొటబయ అందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే గొటబయ భార్య లోమా రాజపక్సే కు యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ కార్డు ఉంది. భార్య కొడుకుతో పాటు గొటబయ గ్రీన్ కార్డు పొంది అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడతారని, అందుకు తన లాయర్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారని శ్రీలంక మీడియా పేర్కొంది. గొటబయ రాజపక్సేకు కూడా యూఎస్ పౌరసత్వం గతంలో ఉంది. కానీ, 2019లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు రాజపక్సే తన యూఎస్ పౌరసత్వాన్ని వదులుకున్నారు. మళ్లీ తిరిగి యూఎస్ పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నింస్తున్నాడు.

Gotabaya Rajapaksa :‘ఎక్కడికెళ్లినా తప్పని తిప్పలు’..సింగపూర్ లో గొటబాయపై 63 పేజీల ఫిర్యాదు..

ప్రస్తుతం గొటబయ భార్యతో కలిసి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఒక హోటల్‌లో ఉంటున్నాడు. అయితే ఆయన ఆగస్టు 25న శ్రీలంకకు తిరిగి వస్తారని, కనీసం నవంబర్ వరకు థాయ్‌లాండ్‌లో ఉండాలనే తన ప్రాథమిక ప్రణాళికను రద్దు చేసుకుంటారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రాజపక్సే తన లాయర్లను సంప్రదించి భద్రతా కారణాల దృష్ట్యా థాయ్‌లాండ్‌లో స్వేచ్ఛగా ఉండలేక పోతున్నట్లు, ఈ నెలాఖరులో శ్రీలంకకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు శ్రీలంకంకు చెందిన ఓ దినపత్రిక తెలిపింది.