Hafiz Saeed: జస్ట్ మిస్.. బాంబు పేలుడు సమయంలో హఫీజ్ తన ఇంట్లోనే ఉన్నాడు.. -పాకిస్తాన్ జర్నలిస్ట్

ఐక్యరాజ్యసమితి హిట్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్.. లాహోర్‌లో తన నివాసం సమీపంలో పేలుడు జరిగిన సమయంలో తన ఇంట్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ జర్నలిస్ట్ వెల్లడించారు. పేలుడు జరిగినప్పుడు ఉగ్రవాది సయీద్ తన ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించాడు.

Hafiz Saeed: జస్ట్ మిస్.. బాంబు పేలుడు సమయంలో హఫీజ్ తన ఇంట్లోనే ఉన్నాడు.. -పాకిస్తాన్ జర్నలిస్ట్

Hafiz Saeed

Journalist: ఐక్యరాజ్యసమితి హిట్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్.. లాహోర్‌లో తన నివాసం సమీపంలో పేలుడు జరిగిన సమయంలో తన ఇంట్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ జర్నలిస్ట్ వెల్లడించారు. పేలుడు జరిగినప్పుడు ఉగ్రవాది సయీద్ తన ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించాడు. హఫీజ్ సయూదే టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్లు సాహ్ని అనే జర్నలిస్ట్ చెప్పారు. హఫీజ్ సయీద్ తన ఇంట్లోనే ఉన్నారని, అయితే, అతని కుటుంబం దీనిని ఖండిస్తోందని చెప్పారు.

డాన్ న్యూస్ ప్రోగ్రాం ‘జరా హాట్ కే’ జర్నలిస్ట్ అమ్జాద్ సయీద్ సాహ్ని మాట్లాడుతూ, ‘హఫీజ్ సయీద్ టార్గెట్‌గా ఈ దాడి జరిగిందని, జైలు శాఖ అతను ఉండే ప్రదేశాన్ని పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఏ ప్రదేశమైనా జైలుగా ప్రకటించే అధికారం జైలు సూపరింటెండెంట్‌కు ఉందని’ చెప్పారు. హఫీజ్ జస్ట్ మిస్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

ముంబై దాడి యొక్క సూత్రధారి, భయంకరమైన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా (లష్కర్-ఎ-తయ్యీబా, ఎల్ఇటి) నాయకుడు హఫీజ్ సయీద్ ఇంటి వెలుపల జరిగిన శక్తివంతమైన కార్ బాంబు పేలుడులో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో ఇరవై మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటి బయట భద్రతలో నిమగ్నమైన పోలీసులు కూడా ఉన్నారు.

లాహోర్‌లోని జౌహర్ టౌన్‌లో BOR సొసైటీలో ఈ పేలుడు జరిగింది. యుఎన్ మరియు యుఎస్ ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించిన హఫీజ్ సయీద్ తన తలకు 10 లక్షల డాలర్లు వెల కట్టింది. భారతదేశంలో జరిగిన ముంబై దాడికి సూత్రదారి కాగా.. ఈ ఘటనలో 161మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌లో హఫీజ్ సయీద్‌కు రెండుసార్లు శిక్ష విధించినప్పటికీ అతను జైలులో ఉండలేదు. లాహోర్ నివాసం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.