Hamas Bassem Issa : ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హమాస్ కమాండర్ బస్సెమ్ ఇస్సా
గాజాపై ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులతో ప్రతిదాడికి దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇస్లామిక్ గ్రూపుకు చీఫ్, హమాస్ అగ్ర నాయకుడు, గాజా సిటీ కమాండర్ బస్సెం ఇస్సా హతమయ్యాడు.
Hamas Senior Commander Bassem Issa : ఇజ్రాయిల్ బలగాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గాజా నుంచి రాకెట్లను హమాస్ ఉగ్రవాదులు ప్రయోగిస్తున్నారు. గాజాపై ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులతో ప్రతిదాడికి దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇస్లామిక్ గ్రూపుకు చీఫ్, హమాస్ అగ్ర నాయకుడు, గాజా సిటీ కమాండర్ బస్సెం ఇస్సా హతమయ్యాడు. ఈ మేరకు హమాస్ ఉగ్రవాద సంస్థ ధృవీకరించింది. 2014 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా విధ్వంసక దాడుల్లో ఇజ్రాయెల్ దళాలు సీనియర్-అత్యధిక హమాస్ సభ్యుడు ఇస్సాను హతమార్చినట్టు హమాస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.
వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటివరకూ 65 మంది మృతిచెందారు. హమాస్ రాకెట్ దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ కమాండర్ ఇస్సా తో పాటు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు కూడా హతమార్చినట్టు ఇజ్రాయెల్‌లోని అంతర్గత భద్రత ప్రకటించింది. గాజాలో ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ లో అత్యున్నత సైనిక అధికారి బస్సేమ్ ఇస్సా.. ఇతడు హమాస్ నాయకులలో ఒకడిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో ఇస్సా మరణించినట్లు ఫాక్స్ న్యూస్ ఒక నివేదికలో తెలిపింది.
Al Sharuk tower in Gaza collapses following IDF bombing
MORE: https://t.co/8JKOoHxxUB pic.twitter.com/67HvX570gV
— RT (@RT_com) May 12, 2021
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమైన ఇతర హమాస్ నేతల్లో సైబర్ కమాండ్ అధిపతి జమా తహ్లా కూడా ఉన్నాడు. జమాల్ జాబెడా, నజ్జెం హతీబ్ పలువురు ఉగ్రవాదులు ఉన్నారు. ఇజ్రాయెల్ భద్రతా సంస్థ షిన్ బెట్ నుంచి పాల్గొన్న మరో 10 హమాస్ కార్యకర్తలు కూడా మరణించారు. హమాస్ కమాండర్లను మట్టుబెట్టాము.. ఇది ప్రారంభం మాత్రమేనని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజాలో మూడు ఎత్తైన భవనాలు ధ్వంసం చేశాయి, వీటిలో ఉన్న హమాస్ ఉగ్రవాదులంతా హతమయ్యారు.