Australia: రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారు.. హిందూ దేవాలయంపై దేశ వ్యతిరేక నినాదాలు

మెల్‌బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్‌లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ లేని సమయంలో దేవాలయానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాసి వెళ్లారు. ఈ దేవాలయ అధికారులు స్పందిస్తూ ‘‘ఇలాంటి విద్వేషం, విధ్వంసాల పట్ల దిగ్భ్రాంతికి గురయ్యామని, దీనిపై తీవ్రంగా విచారిస్తున్నాం’’ అని అన్నారు.

Australia: రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారు.. హిందూ దేవాలయంపై దేశ వ్యతిరేక నినాదాలు

Hindu temple in Australia defaced with anti-India graffiti by Khalistan supporters

Australia: హిందూ దేవాలయంపై ‘హిందుస్థాన్ ముర్దాబాద్’ అనే నినాదాలు కలకలాన్ని రేపాయి. ఈ ఒక్కటే కాకుండా భారత వ్యతిరేక నినాదాలు అనేకం కనిపించాయి. ఈ నినాదాలు చేసింది ఖలిస్థాన్ మద్దతుదారులని తెలిసింది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ మీద తాజాగా ఈ నినాదాలు కనిపించినట్లు ఆస్ట్రేలియాకు చెందిన మీడియా గురువారం పేర్కొంది.

Minister Chandrashekhar: రామచరితమానస్‭పై వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గేదే లేదంటున్న విద్యామంత్రి

ఆస్ట్రేలియన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, మెల్‌బోర్న్ శివారు ప్రాంతం మిల్ పార్క్‌లో ఈ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరూ లేని సమయంలో దేవాలయానికి వచ్చిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాసి వెళ్లారు. ఈ దేవాలయ అధికారులు స్పందిస్తూ ‘‘ఇలాంటి విద్వేషం, విధ్వంసాల పట్ల దిగ్భ్రాంతికి గురయ్యామని, దీనిపై తీవ్రంగా విచారిస్తున్నాం’’ అని అన్నారు. శాంతి, సామరస్యాల కోసం తాము పూజలు, ప్రార్థనలు చేస్తామని తెలిపారు.

Madhya Pradesh: మోదీని చంపాలంటూ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతకు బెయిల్ నిరాకరించిన కోర్టు

మెల్‌బోర్న్ హిందూ కమ్యూనిటీ ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంస్కృతిక శాఖ మంత్రి కూడా ఈ దేవాలయమున్న ప్రాంతానికి చెందినవారే. గత ఏడాది నుంచి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయం గోడలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారని చెప్పారు.