Ramcharitmanas: రామచరితమానస్‭పై వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గేదే లేదంటున్న విద్యామంత్రి

ట్విట్టర్ ద్వారా సైతం ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రపతిని జగ్గానాథ్ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సందర్భాన్ని, జితన్ రాం మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాంఝీ వెళ్లిన గుడిని శుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. శబరి చేత బెర్రీలు తిన్నప్పుడు బాగానే ఉన్న రాముడు, అకస్మాత్తుగా కులవివక్ష రాముడిగా ఎలా మారాడని ప్రశ్నించారు. తాను బహుజన సమాజం గొంతుక వినిపిస్తున్నానని, బహుజనులను ఆయా గ్రంథాల్లో తీవ్రంగా అవమానించారని చంద్రశేఖర్ అన్నారు.

Ramcharitmanas: రామచరితమానస్‭పై వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గేదే లేదంటున్న విద్యామంత్రి

Bihar Minister Chandra Shekhar Says 'Won't Apologise' Over 'Ramcharitmanas Spread Hate' Remark

Updated On : January 23, 2023 / 7:11 PM IST

Ramcharitmanas: రామచరితమానస్‭పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిహార్ విద్యామంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత చంద్రశేఖర్‭పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సదరు మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ సహా హిందూ సంఘాలు, సాధువులు ఆయనపై మండిపడుతున్నారు. రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అయితే చంద్రశేఖర్ నాలుక కోయడానికి 10 కోట్ల రూపాయల వెల కట్టారు. ఇంత దుమారం రేగినా ఆ మంత్రి తన వ్యాఖ్యలను మరింత సమర్ధించుకోవడం గమనార్హం. అయితే క్షమాపణ చెప్పడం గురించి స్పందిస్తూ, అలాంటిది జరిగే సమస్యే లేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Karnataka: కర్ణాటకలో రివర్స్ అయిన ‘ఆపరేషన్ కమల’.. ఘర్ వాపసీకి సై అన్న హెచ్ విశ్వనాథ్

రామచరితమానస్‭ విధ్వేషాలు రెచ్చగొడుతుందంటూ మంత్రి చంద్రశేఖర్ మొదట వ్యాఖ్యానించారు. అనంతరం, తీవ్ర దుమారం రేగడంతో తన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ‘‘మనుస్మృతి, రామచరితమానస్, గురు గోల్వాల్కర్ పుస్తకాలు ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలు. ద్వేషం దేశాన్ని గొప్పగా చేయదు, ప్రేమ దేశాన్ని గొప్పగా చేస్తుంది’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు? అందులో దేశంలోని మెజారిటీ ప్రజలపై చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు విషం అయినట్లే నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్‭లో చెప్పారు. ఇది సమాజంలోని దళితులు-వెనుకబడినవారు, మహిళలు విద్యను పొందకుండా నిరోధిస్తుంది’’ అని అన్నారు.

Sethusamudram: బీజేపీ బిగ్ యూటర్న్.. రామసేతుపై నిర్మించే ఆ ప్రాజెక్టు మద్దతు, కానీ ఒక్క షరతు

ఇక ట్విట్టర్ ద్వారా సైతం ఆయన స్పందిస్తూ ‘‘రాష్ట్రపతిని జగ్గానాథ్ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సందర్భాన్ని, జితన్ రాం మాంఝీ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాంఝీ వెళ్లిన గుడిని శుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. శబరి చేత బెర్రీలు తిన్నప్పుడు బాగానే ఉన్న రాముడు, అకస్మాత్తుగా కులవివక్ష రాముడిగా ఎలా మారాడని ప్రశ్నించారు. తాను బహుజన సమాజం గొంతుక వినిపిస్తున్నానని, బహుజనులను ఆయా గ్రంథాల్లో తీవ్రంగా అవమానించారని చంద్రశేఖర్ అన్నారు.