Sethusamudram: బీజేపీ బిగ్ యూటర్న్.. రామసేతుపై నిర్మించే ఆ ప్రాజెక్టుకు మద్దతు, కానీ ఒక్క షరతు

ఇది డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కలల ప్రాజెక్ట్. దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అప్పట్లో దీనిని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ముందుకు తీసుకురాగా, అప్పట్లోనే ఆమోదం లభించింది. 2,400 కోట్ల రూపాయల అంచనా వ్యాయం నిర్ణయించి పనులు ప్రారంభించారు. అయితే ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హయాంలో 2007లో మతపరమైన కారణాలను

Sethusamudram: బీజేపీ బిగ్ యూటర్న్.. రామసేతుపై నిర్మించే ఆ ప్రాజెక్టుకు మద్దతు, కానీ ఒక్క షరతు

BJP's U-Turn, Backs MK Stalin Over Sethusamudram Project, With Condition

Sethusamudram: శ్రీలంక చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భారతదేశంలోని పశ్చిమ, తూర్పు తీరాలను కలిపే సేతుసముద్రం ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసుకుంది. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొదట వ్యతిరేకించేనట్టే కనిపించినప్పటికీ.. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టిన తీర్మానానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఒక్క బీజేపీయే కాకుండా, దాదాపు అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. “ఈ ప్రాజెక్టు అమలులో జాప్యం చేయడం వల్ల తమిళనాడు అభివృద్ధికి అవరోధంగా మారుతుంది’’ అని తీర్మానంలో పేర్కొన్నారు.

VC Jagdeep Dhankar: పార్లమెంట్ కాదు, రాజ్యాంగం సుప్రీం.. ఉపరాష్ట్రపతి జగ్‭దీప్ ధన్‭కర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్

వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఆడంస్ బ్రిడ్జ్ (రామసేతు) మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కనుక చేపడితే రామసేతు కనిపించదనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ దీనికి బీజేపీ మద్దతు ఇవ్వడం గమనార్హం. ఆడంస్ బ్రిడ్జీ విషయమై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల చేసిన ప్రకటన అనంతరం సేతుసముద్రం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన డిమాండుకు మరింత సాన పెట్టింది. భారతీయ ఇతిహాసం రామాయణంలో వివరించిన విధంగా మతపరమైన ప్రాముఖ్యత కలిగిన భూసంబంధమైన లింక్ వాస్తవానికి భారతదేశం, శ్రీలంక మధ్య ఉందో లేదో చెప్పడం ‘కష్ట’మని ఆయన పార్లమెంటులో చెప్పారు.

Karnataka: 26వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఈ ప్రాజెక్టు 1860లో బ్రిటీష్ వారి పాలనలోనే రూపొందించబడింది. నౌకలు శ్రీలంక చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రయాణ సమయం, దూరాన్ని తగ్గించే విధంగా అప్పట్లోనే డిజైన్ చేశారు. అయితే రామసేతు ఉందనే అనుమానాలతో ఈ ప్రాజెక్టుకు మతపరమైన సమూహాల నుండి వ్యతిరేకత ఎదురైంది. దీంతో బ్రిటిషు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎందుకంటే రామసేతులో భాగమని చెప్పబడే పాక్ జలసంధిని లోతుగా త్రవ్వడం, అధ్యయనం చేయడం చాలా ముఖ్యం.

Bihar: దుమారం రేపిన విద్యామంత్రి వ్యాఖ్యలు.. నాలుక కోసిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటున్న రామజన్మభూమి ప్రధాన అర్చకుడు

ఇది డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కలల ప్రాజెక్ట్. దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అప్పట్లో దీనిని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ముందుకు తీసుకురాగా, అప్పట్లోనే ఆమోదం లభించింది. 2,400 కోట్ల రూపాయల అంచనా వ్యాయం నిర్ణయించి పనులు ప్రారంభించారు. అయితే ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో హయాంలో 2007లో మతపరమైన కారణాలను చూపిస్తూ హిందూ సమూహాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆపివేశారు.

PM Modi: మోదీకి దండ వేసేందుకు బారికేడ్లు దాటుకెళ్లిన యువకుడు.. భద్రతా వైఫల్యం లేదన్న అధికారులు

అయితే రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ స్వయంగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రే పార్లమెంటులో వ్యాఖ్యానించడంతో దీనికి లైన్ క్లియర్ అయినట్టేనని అనుకున్నారు. అయితే కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను దాటి ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఆశాభావం ఏంటంటే.. గతంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ గురువారం తీర్మానానికి మద్దతు పలకడం.

Karnataka: కర్ణాటకలో రివర్స్ అయిన ‘ఆపరేషన్ కమల’.. ఘర్ వాపసీకి సై అన్న హెచ్ విశ్వనాథ్

తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ నాయకుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ “మేము ఈ తీర్మానానికి మద్దతు ఇస్తున్నాము. రామసేతుపై ప్రభావం చూపకపోతే మేము ప్రాజెక్ట్‌ను స్వాగతిస్తాము. ప్రాజెక్ట్ మారితే దక్షిణాది(దక్షిణ తమిళనాడు)లో మా కంటే ఎవరూ సంతోషంగా ఉండరు’’ అని అన్నారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ‘‘బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత జయలలిత మద్దతిచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తమిళనాడు అభివృద్ధి చెంది ఉండేది. 50,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందేవారు. పరోక్షంగా వేలాది ఉద్యోగాలు వచ్చేవి’’ అని అన్నారు.