Hong Kong : డెల్టా భయం..బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం

యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్​ ప్రకటించింది.

Hong Kong : డెల్టా భయం..బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం

Hong Kong

Hong Kong యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్​ ప్రకటించింది. గురువారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వేరియంట్​లు వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం హాంకాంగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక,బ్రిటన్ లో కోవిడ్ మహమ్మారి పరిస్థితి మళ్లీ కొంత ఆందోళనకరంగా ఉందని.. అక్కడ డెల్టా వేరియంట్ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్​ను అత్యధిక ప్రమాదకర కేటగిరీలో ఉంచినట్లు హాంకాంగ్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం బ్రిటన్ లో కనీసం రెండు గంటలకు మించి ఉన్నవారికి హాంకాంగ్​లోకి ప్రవేశం ఉండదు.

కాగా, బ్రిటన్ నుంచి విమానాల రాకను హాంకాంగ్ నిషేధించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు కూడా బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.