Fire Incident In Thailand: థాయ్‌లాండ్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవదహనం

థాయ్‌లాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న చోన్‌బురి ప్రావిన్స్‌లోని నైట్ క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Fire Incident In Thailand: థాయ్‌లాండ్‌ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవదహనం

Fire Incident In Thailand

Fire Incident In Thailand: థాయ్‌లాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న చోన్ బురి ప్రావిన్స్ లోని నైట్ క్లబ్ లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తాహిప్ జిల్లాలోని మౌంటైన్ బి నైట్ క్లబ్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరణించినవారందరూ థాయ్ జాతీయులని అక్కడి పోలీసులు తెలిపారు.

Fire Incident In Thailand

శుక్రవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో క్లబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్ మొత్తం వ్యాపించడంతో మంటల్లో చిక్కుకొని 13 మంది మరణించారు. వీరిలో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు మూడు గంటల పాటు కష్టపడ్డారు. అప్పటికే నైట్ క్లబ్ అధికభాగం కాలిపోయింది.

Fire Incident In Thailand

 

క్లబ్‌లో మంటలు వ్యాపించగానే స్థానికులు పరుగులు పెట్టారు. కొందరు శరీరానికి మంటలు అంటుకోవటంతో మంటలతోనే పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం క్లబ్ లోని గోడలకు రసాయనాల వల్లేనని తెలిసింది. వాటివల్ల మంటలను అదుపు చేయడానికి చాలా సమయం పట్టిందని అధికారులు అన్నారు. మంటల్లో చిక్కుకొని సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Fire Incident In Thailand

అయితే చికిత్సపొందుతున్న వారిలో 20మందికిపైగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.