Antarctica ice : అంటార్కిటికాలో గ్లోబల్ వార్మింగ్‌ను తట్టుకొని పెరిగిన ఐస్ షెల్ఫ్‌లు

అంటార్కిటికా.. ఈ ఖండం పేరు వినగానే.. మంచు మాత్రమే గుర్తొస్తుంది. ఆ మంచు గురించి.. అంటార్కిటికాలో మంచు కరుగుతోంది. మానవాళికి.. మంచు ముప్పు పొంచి ఉంది. అక్కడ కరిగితే.. ఇక్కడ మునుగుతాం లాంటి డేంజర్ బెల్స్ అప్పుడప్పుడు వినిపిస్తుంటాయ్. కానీ.. చాలా ఏళ్ల తర్వాత.. అంటార్కిటికా నుంచి ఓ గుడ్ న్యూస్ బయటకొచ్చింది. అదెలాంటిదంటే.. ఇప్పట్లో ఈ భూమిపై.. మంచుతో ఎలాంటి ఉపద్రవం ముంచుకు రాదని ధైర్యాన్నిచ్చేలా ఉంది.

Antarctica ice : అంటార్కిటికాలో గ్లోబల్ వార్మింగ్‌ను తట్టుకొని పెరిగిన ఐస్ షెల్ఫ్‌లు

Ice Shelves That Have Grown  In Antarctica

Ice shelves that have grown  in Antarctica : అంటార్కిటికా.. ఈ ఖండం పేరు వినగానే.. మంచు మాత్రమే గుర్తొస్తుంది. ఆ మంచు గురించి.. ఒక్కసారి కూడా మంచి వార్త బయటకి రాదు. అంటార్కిటికాలో మంచు కరుగుతోంది. మానవాళికి.. మంచు ముప్పు పొంచి ఉంది. అక్కడ కరిగితే.. ఇక్కడ మునుగుతాం లాంటి డేంజర్ బెల్స్ అప్పుడప్పుడు వినిపిస్తుంటాయ్. కానీ.. చాలా ఏళ్ల తర్వాత.. అంటార్కిటికా నుంచి ఓ గుడ్ న్యూస్ బయటకొచ్చింది. అదెలాంటిదంటే.. ఇప్పట్లో ఈ భూమిపై.. మంచుతో ఎలాంటి ఉపద్రవం ముంచుకు రాదని ధైర్యాన్నిచ్చేలా ఉంది.

మంచు కరిగేవి.. మంచు ఫలకాలు పడిపోయేవి..
అంటార్కిటికా అంటే.. మనకు కనిపించే విజువల్ ఇదే. మంచు ఫలకాలు పడిపోవడం.. పెద్ద పెద్ద మంచు ముక్కలు నీటిలో కొట్టుకుపోవడం.. మంచు కరిగిపోవడం లాంటివే చూశాం. కానీ.. కొన్నేళ్ల తర్వాత అంటార్కిటికాలో మంచు గురించి ఓ మంచి విషయం తెలిసింది. మంచు ఫలకాలు కరిగే దశ నుంచి.. మంచు ఫలకాలు పెరిగే దాకా వచ్చాయ్ పరిస్థితులు. ఇంతటి గ్లోబల్ వార్మింగ్‌లో కూడా.. ఇంతటి వాతావరణ మార్పులను తట్టుకొని కూడా.. గత 20 ఏళ్లలో.. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో ఐస్ షెల్ఫ్‌లు బాగా పెరిగాయ్.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, న్యూకాసెల్ యూనివర్సిటీ, న్యూజిలాండ్‌లోని క్యాంటర్‌బరీ యూనివర్సిటీ జాయింట్‌గా చేసిన ఓ రీసెర్చ్‌లో.. ఈ విషయం బయటపడింది. వాతావరణ రికార్డులతో పాటు హిస్టారికల్ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి.. అంటార్కిటికాలో సంభవించిన మార్పులపై ఓ అంచనాకు వచ్చారు. అలా.. గత 20 ఏళ్లలో.. చాలా ప్రాంతాల్లో.. మంచు ఫలకాలు పెరిగినట్లు తేల్చారు.

ఈస్ట్ అంటార్కిటిక్ ద్వీపకల్పం వెంబడి ఉన్న 870 మైళ్ల పొడవున్న మంచు షెల్ఫ్‌లో.. 85 శాతం ముందుకు సాగినట్లు కనుగొన్నారు. ప్రస్తుతానికి.. వాతావరణ మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం కారణంగా.. అంటార్కిటికా చుట్టూ ఉన్న సముద్రపు మంచు.. ఎలా అభివృద్ధి చెందుతుందన్నది.. కచ్చితంగా తెలియదు. అయితే.. దక్షిణ మహా సముద్రంలో.. మాత్రం కొంత మేర మంచు ఫలకాలు కరుగుతున్నాయి. ఏదేమైనా.. 2020లో మంచుకొండలు విరిగిపోవడం వల్ల.. వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకు రాకపోయినా.. భవిష్యత్తులో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని.. పరిశోధనలు చెబుతున్నాయ్.