Public Urination: బహిరంగ ప్రదేశాల్లో గోడలపై మూత్రం పోస్తున్నారా..? అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం ..!

పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అయినా కొందరు రద్దీ ప్రాంతాల్లోసైత గోడలపై మూత్ర విసర్జన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. లండన్‌లోని సాహో ప్రాంతంలో ఇలాంటి సమస్యే స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యకు చెక్‌పెట్టేలా గ్రేటర్ లండన్ పరిధి వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ వినూత్న పరిష్కార మార్గాన్ని అవలంభిస్తోంది.

Public Urination: బహిరంగ ప్రదేశాల్లో గోడలపై మూత్రం పోస్తున్నారా..? అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం ..!

Anti Pee Paint

Updated On : January 21, 2023 / 7:36 AM IST

Public Urination: పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అయినా కొందరు రద్దీ ప్రాంతాల్లోసైత గోడలపై మూత్ర విసర్జన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఈ బహిరంగ మూత్ర విసర్జన సమస్య భారతదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోని పలు ప్రాంతాల్లో ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు భారత్ సహా, అనేక దేశాల్లో పబ్లిక్ టాయిలెంట్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా కొందరు తీరు మార్చుకోకపోవటంతో రెయింబవళ్లు జనసంచారం ఉండే నగరాల్లోని ప్రజలకు ఇదో ఇబ్బందికర సమస్యగా మారింది. లండన్‌లోని సాహో ప్రాంతంలో ఇలాంటి సమస్యే స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా గ్రేటర్ లండన్ పరిధి వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ వినూత్న పరిష్కార మార్గాన్ని అవలంభిస్తోంది.

Urination: ఇబ్బందికరమైన మూత్రవిసర్జన మరో సమస్యకు కారణమేమో!

సాహోలోని 400కుపైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో 24గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద ప్రాంతాలతో పాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి. ఇక్కడ చాలినన్ని టాయిలెట్స్ లేకపోవటంతో జనం రోడ్లపైనే గోడులకు మూత్రం పోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గందభరితంగా మారుతుంది. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు లండన్ యంత్రాంగం యేటా రూ.10.26కోట్లు వెచ్చిస్తుంది. అయినా సమస్య పరిష్కారం కాకపోవటంతో స్థానిక నివాసదారులు గగ్గోలు పెడుతున్నారు.

Air India Urination Case: విమానంలో మూత్ర విసర్జన కేసు.. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా ..

బహిరంగ ప్రదేశల్లో మూత్ర విసర్జన చేసేవారికి చెక్ పెట్టేందుకు వెస్ట్ మినిస్టర్ సిటీ కౌన్సిల్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది. పారదర్శక వాటర్ రిపెల్లెంట్ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ర్పే చేస్తే మూత్రం పోసిన వెంటనే తిరిగి ఆ మూత్రం పోసే వ్యక్తిపైనే చింది పడుతుంది. తొలుత సాహో ప్రాంతంలోని సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రదేశాల్లో గోడలపై ఈ ద్రావకాన్ని అధికారులు స్ప్రే చేయించారు. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని జర్మనీలోనూ ప్రయోగాత్మకంగా చేసి మంచి ఫలితం సాధించారు. ఈ ప్రయోగం ద్వారా బహిరంగ మూత్ర విసర్జనకు పూర్తిగా స్వస్తి చెప్పొచ్చని లండన్ ప్రభుత్వం భావిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.