Imran khan: ఇమ్రాన్ ఖానా మజాకా.. 15కి.మీ దూరంకు హెలికాప్టర్‌లో ప్రయాణం.. 40కోట్లు ఖర్చు..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగిన సమయంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత అధికార పక్షం సభ్యులు ....

Imran khan: ఇమ్రాన్ ఖానా మజాకా.. 15కి.మీ దూరంకు హెలికాప్టర్‌లో ప్రయాణం.. 40కోట్లు ఖర్చు..

Imran Khan

Imran khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగిన సమయంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత అధికార పక్షం సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి అందిన కానుకల విషయంలో కేవలం 20శాతం డబ్బు కట్టి రూ. 5.7కోట్లు ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నారని అధికార పక్షం సభ్యులు విమర్శలు చేస్తున్నారు. ఇతర దేశాల ప్రతినిధులు పాక్‌కు వచ్చిన సమయంలో బహుమానాలు అందజేస్తారు. అయితే ఇవి ప్రభుత్వానికే చెందుతాయి. కానీ ఇమ్రాన్ ఆ కానుకలను ఇవ్వకుండా అమ్ముకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

Imran Khan: విదేశీయుల నుంచి విరాళాలు అడుగుతున్న ఇమ్రాన్ ఖాన్

ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ సొమ్ము దుబారా చేశారని ప్రస్తుత అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ దుబారా ఖర్చు విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇమ్రాన్ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీగాలాలోని ప్రయివేటు నివాసానికి 15కిలో మీటర్ల దూరం హెలికాప్టర్ ద్వారా సాగించిన రాకపోకల ఖర్చు రూ.40 కోట్లు (984 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు) అయినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ ప్రధానిగా 2018 సంవత్సరం జూన్ నెలలో ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి 2022 మార్చి వరకు కేవలం హెలికాప్టర్ లో ప్రధాని నివాసం నుంచి తన నివాసానికి రాకపోకలు సాగించేందుకు రూ. 40 కోట్లు వినియోగించినట్లు తెలిపారు. ఇందులో ప్రయాణ ఖర్చు 472 మిలియన్లు కాగా, నిర్వహణకు 512 మిలియన్ల ఖర్చు చేశారు.