Russia-Ukraine War : రష్యా నుంచి 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి చేసుకుంటున్న భారత్..ఇక ధరలు తగ్గనున్నాయా?

రష్యా నుంచి 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి చేసుకుంటోంది భారత్..దీంతో ఇక ధరలు తగ్గనున్నాయా? అని అనిపిస్తోందిి.కానీ అధిక ధరకు భారత్ కొనటం వల్ల నూనెల ధరలు ఇంకా పెరగనున్నాయా?!

Russia-Ukraine War : రష్యా నుంచి 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి చేసుకుంటున్న భారత్..ఇక ధరలు తగ్గనున్నాయా?

India Buys Russian Sunflower Oil As Ukraine Supplies Halt

Updated On : March 30, 2022 / 11:12 AM IST

India Buys Russian Sunflower Oil As Ukraine Supplies Halt : యుక్రెయిన్. సన్ ఫ్లవర్ నూనెల ఉత్పత్తిత్తో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశం. ఇప్పటి వరకు భారత్ ఎక్కువగా సన్ ప్లవర్ నూనెల్ని యుక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకునేది. కానీ రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న క్రమంలో యుక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో భారత్ లో వంటనూనెల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా సన్న ఫ్లవర్ వంట నూనె లీటర్ రూ.190 నుంచి రూ.250 వరకు అమ్ముతోంది.

Also read : Ukraine – Russia War : టర్కీ టాక్స్ సక్సెస్.. యుక్రెయిన్ ‌- రష్యా యుద్ధం ఇక ముగిసినట్టే..!

ఈ క్రమంలో భారత్ రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం అత్యధిక ధర చెల్లించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ అమెరికాలో సోయాబీన్ సాగు తగ్గడంతో వంటనూనెల లభ్యత తగ్గింది.

దీంతో రష్యా నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం ద్వారా వంటనూనెల కొరతను అధిగమించవచ్చని జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి తెలిపారు. వచ్చే నెలలో భారత్‌లో దిగుమతి అయ్యేలా ఈ సంస్థ రష్యా నుంచి 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ నూనెను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆయిల్ దిగుమతులు ఏప్రిల్ లో జరగనున్నాయి.

Also read : Russia Armed Forces Killed : యుద్ధంలో 17,200 మంది రష్యన్ సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి ముందునాటితో పోలిస్తే అత్యధిక ధర చెల్లిస్తున్నట్టు డీలర్లు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు టన్నుకు 1630 డాలర్లు.. భారత కరెన్సీలో రూ. 1.25 లక్షలు చెల్లిస్తే ఇప్పుడు 2,150 డాలర్లు (దాదాపు రూ. 1.65 లక్షలు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. రష్యా,యుక్రెయిన్ లో సన్ ఫ్లవర్ సాగు విస్తృతంగా జరగుతుంది. ఈ రెండు దేశాలే ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతుల్లో 60 శాతంగా ఉన్నాయి.