Oil from Russia: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే నెలవారీ చమురు పరిమాణం యూరోప్ లో ఒక పూట వినియోగంతో సమానం

రష్యా నుంచి ఒక నెల వ్యవధిలో భారత్ కొనుగోలు చేసే చమురు పరిమాణం యూరోప్ లో ఒక పూట వినియోగంతో సమానమని జైశంకర్ బ్లింకేం తో అన్నారు

Oil from Russia: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే నెలవారీ చమురు పరిమాణం యూరోప్ లో ఒక పూట వినియోగంతో సమానం

Jaishankar

Oil from Russia: యుక్రెయిన్ తో యుద్ధం కారణంగా అమెరికా రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగిస్తూనే ఉంది. ప్రధానంగా రష్యా నుంచి వ్యాపార వాణిజ్య సంబంధాలు జరుపరాదంటూ అమెరికా ఇతర దేశాలను హెచ్చరిస్తూ వస్తుంది. అయితే అమెరికా ఆంక్షలను, హెచ్చరికలను పట్టించుకోని భారత్ మాత్రం..రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేలా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయంపై అసహనం వ్యక్తం చేసిన అమెరికా..భారత్ తీరును ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక మిన్నకుండిపోయింది. కాగా, తాజాగా అమెరికా – భారత్ మధ్య ద్వంద్వ(2+2) రీతిలో సమావేశాలు ప్రారంభమైయ్యాయి. సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ..వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొనగా..ఇరు దేశాల విదేశాంగ మంత్రులు వాషింగ్టన్ లో నేరుగా సమావేశం అయ్యారు.

Also read:Sri lanka crisis : చేతులెత్తేసిన శ్రీలంక.. 51 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులు తీర్చలేమని వెల్లడి..

ఈ సమావేశంలో మొదటి ప్రాధాన్యంశంగా యుక్రెయిన్ రష్యా సంక్షోభం గురించే ఇరు దేశాలు చర్చించాయి. అదే సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జే బ్లింకెన్ తో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్లింకెన్ మాట్లాడుతూ భారతదేశంతో భాగస్వామ్యం “మరింత పర్యవసానంగా మరియు కీలకమైనదిగా” అభివర్ణించారు. ప్రస్తుత ద్వైక్షిక సమావేశాలు ఇరు దేశాలకు ఒక ముఖ్య ఘట్టంగా బ్లింకెన్ పేర్కొన్నారు. అదే సమయంలో యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా పై అమెరికా ఆంక్షలకు కట్టుబడి భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకుండా ఉండాల్సిందని బ్లింకెన్ వ్యాఖ్యానించగా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అందుకు ధీటుగా బదులిచ్చారు.

Also read:Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..

రష్యా నుంచి ఒక నెల వ్యవధిలో భారత్ కొనుగోలు చేసే చమురు పరిమాణం యూరోప్ లో ఒక పూట వినియోగంతో సమానమని జైశంకర్ బ్లింకేం తో అన్నారు. రష్యాతో భారత్ చేసుకున్న చమురు ఒప్పందమే అమెరికా చూస్తుందని..కానీ భారత్ లో ఎనర్జీ సెక్టార్ పరిస్థితులు, చమురు అవసరాలను గమనించలేక పోవడం విడ్డురంగా ఉందని జైశంకర్ అన్నారు. చమురు గణాంకాలను పరిశీలిస్తే..అమెరికా తమ దృష్టంతా యూరోప్ పై ఉంచాలన్న జైశంకర్..బహుశా ఒక నెలలో భారత్ మొత్తం చమురు కొనుగోళ్లు..యూరప్ మొత్తం ఒక మధ్యాహ్న సమయంలో చేసే దానికంటే తక్కువగా ఉండవచ్చని అన్నారు.