No rain village : వర్షం ప‌డ‌ని గ్రామం..! మేఘాలకు పైన ఉండే వింత ప్రాంతం..!

No rain village : వర్షం ప‌డ‌ని గ్రామం..! మేఘాలకు పైన ఉండే వింత ప్రాంతం..!

No Rain Village

Only village in the world where it never Rains : ప్రపంచంలో ఎన్నో వింతలు..మరెన్నో విచిత్రాలు. అద్భుతాలకు నెలవు ఈ భూమి. రహస్యాల పుట్టిల్లు ఈ పుడమితల్లి. ఓ చోట ఎండలు మండిపోతాయి. మరోచోట చలి వణికిస్తుంది. మరోచోట వర్షాలు ఎడతెగక కురుస్తూనే ఉంటాయి. ఇంకోచోట అస్సలు వర్షమే కురవదు. వింత వాతావరనాలు విచిత్ర పరిస్థితులు ఈ భూమిమీద లెక్కలేనన్ని ఉన్నాయి. అటువంటి ఓ వింత గ్రామం. ఆ గ్రామంలో అస్సలు వర్షమే కురవదు. ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామానికి భిన్నంగా అస్స‌లు ఎప్పుడూ వర్షం పడని ప్రదేశం ఒక‌టుంది. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనా (Sana)కు పశ్చిమాన ఉంది.

వర్షమే కురవని ఈ గ్రామానికి పర్యాటకు వస్తుంటారు. చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండే గ్రామంలోని వాతావరణం వేడిగా ఉంటుంది. చలి వణికించే శీతాకాలం ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉన్నా..సూర్యుడు ఉదయించగానే వాతావరణ వేడెక్కిపోతుంది. ఇది ఈ గ్రామ ప్రజలకు అలవాటే. పర్యాటకులకు కూడా అలవాటే.అయిన తరచూ పర్యాటకులు ఈ గ్రామానికి వస్తుంటారు.

ఈ గ్రామంలో పురాతన నిర్మాణాలతో పాటు..ఆధునిక నిర్మాణాలు కూడా ఉన్నాయి.ఎప్పుడూ వర్షం పడకపోవటానికి కారణం… ఈ గ్రామం మేఘాలపైన ఉంటుంది. మరి మేఘాల కింద ఉంటేనే కదా వర్షం పడేది. మరి మేఘాలకు పైన ఉంటే వర్షం ఎలా పడుతుంది? అదన్నమాట అసలు సంగతి. ఈ గ్రామం కింద మేఘాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. అందుకే ఈ గ్రామంలో వ‌ర్షాలు కురవ‌వు. అయితే గ్రామం కిందన వ‌ర్షాలు ప‌డ‌టాన్ని అక్కడ నుంచి చూడవచ్చట..భలే ఉంది కదూ..ఈ వింత గ్రామం వర్షాలు పడని గ్రామం..ఎక్కడా చూడని ప్రత్యేకత ఈ ‘అల్-హుతైబ్’ గ్రామ ప్రత్యేకత.

‘అల్-హుతైబ్’ గ్రామంలో ఆల్ బోహ్రా లేదా అల్ ముకర్మా ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీలు అంటారు. వారు ముంబైలో నివసించిన మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతత్వంలోని ఇస్మాయిలీ (ముస్లిం) శాఖ నుండి వచ్చారు. మహమ్మద్ బుర్హానుద్దీన్ 2014 లో మరణించే వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామాన్ని సందర్శించేవారు.

ఈ గ్రామం గురించి చాలా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఎప్పుడూ వర్షం పడదు. దీనికి కారణం ఈ గ్రామం మేఘాల పైన ఉంది. ఈ గ్రామం కింద మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఇక్కడ ఉన్న దృశ్యం మీరు ఎక్కడా చూడని విధంగా ఉంది.