International sign day : ప్రపంచ సంజ్ఞ దినోత్సవం..వారికోసమే ఈ రోజు

సెప్టెంబర్ 23. ప్రపంచ సంజ్ఞ దినోత్సవం..

International sign day : ప్రపంచ సంజ్ఞ దినోత్సవం..వారికోసమే ఈ రోజు

International Sign Day

International sign day 2021 : మనం మాట్లాడుకుంటాం. అలాగే సైగలు కూడా చేసుకుంటాం.మాట్లాడటం వచ్చినవారు మాటలు మాట్లాడతారు.సైగలు కూడా చేస్తారు.కానీ చెవిటి మూగ ఉన్నవారికి ఓ భాష ఉంటుంది.అదే సైగల భాష. దీన్నే సంజ్ఞ భాష అని కూడా అంటారు.దాన్నే బదిరుల భాష అని కూడా అంటారు. మాటలకు ఓ రోజు ఉందో లేదో గానీ ‘సైగ’లకు మాత్రం ఓ రోజు ఉంది.అదే సెప్టెంబర్ 23. ప్రపంచ సైగల దినోత్సవం.

Read more :World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

మనం మాట్లాడుకునే భాష బధిరులకు అర్థం కాదు. వారు సైగలు మనలో చాలామందికి అర్థం కావు.కానీ ఆ సైగలే వారి కమ్యూనికేషన్.బధిరుల కోసం ప్రత్యేకంగా గుర్తించి, అభివృద్ధి చేసిన భాషే ‘సంజ్ఞ భాష’. దీన్నే సైన్‌ లాంగ్వేజ్‌ ( sign language)అంటారు.ఈ సైన్‌ లాంగ్వేజ్‌ ప్రాముఖ్యతను మరింతగా పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 23న అంతర్జాతీయ సంజ్ఞ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. చెవిటి వారి రోజువారీ సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఈ సైగల భాషను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ఈ సంజ్ఙ భాషను మొదటిసారిగా 2018లో వారోత్సవాలతో ప్రారంభించి..దాన్నే అంతర్జాతీయ సైగల భాషా దినోత్సవంగా మార్చారు. ప్రతి ఏడాది ప్రపంచ డెఫ్‌ సమాఖ్య ద్వారా ఒక థీమ్‌ ప్రతిపాదిస్తారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెవిటివారి సమైఖ్యతతో ప్రారంభించారు.

Read more :World Rhino Day 2021 : ఖడ్గమృగాల గురించి ఆసక్తికర విషయాలు

ఇంటర్నేషనల్‌ డెఫ్‌ డేని మొదటిసారి 1958 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవం సంజ్ఞ భాషల ఉపయోగానికి మద్ధతు ఇచ్చే సమావేశానికి ప్రోత్సహకంగా ఈ భాష నిలుస్తోంది. చెవిటి వ్యక్తుల మానవహక్కుల కోసం సంకేత భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఈ రోజును యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ United nation general assembly ప్రకటించింది.బధిరుల ఎదుగుదలకు, అభివృద్ధికి సంకేత భాషలో నాణ్యమైన విద్యతోపాటు ఈ భాషకు సేవల కోసం ఈ రోజు ప్రధాన లక్ష్యంగా ఈరోజును నిర్వహిస్తున్నారు.