IRAN Moraliry Police : ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి ముందు లేని ‘హిజాబ్‌’ ఆంక్షలు తర్వాత ఎలా మొదలయ్యాయి?మొరాలిటీ పోలీసింగ్‌ ఏర్పాటు వెనుక కారణాలు

ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి ముందు లేని ‘హిజాబ్‌’ ఆంక్షలు తర్వాత ఎలా మొదలయ్యాయి?మొరాలిటీ పోలీసింగ్‌ ఏర్పాటు వెనుక కారణాలు ఏమిటి? మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఎలా నడుచుకోవాలో కూడా ప్రభుత్వమే చెబుతున్న పరిస్థితి నుంచి తండ్రి, సోదరులు, భర్త చెప్పినట్లు బతకాలి అనే దుస్థితి నుంచి వారి స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన పరిస్థితికి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది?

IRAN Moraliry Police : ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి ముందు లేని ‘హిజాబ్‌’ ఆంక్షలు తర్వాత ఎలా మొదలయ్యాయి?మొరాలిటీ పోలీసింగ్‌ ఏర్పాటు వెనుక కారణాలు

Iranian womens..Before and after the Islamic Revolution

IRAN Moraliry Police : ఇరాన్‌లో మహిళలకు స్వేచ్ఛ అనేద కరువైంది. వారు ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఎలా నడుచుకోవాలో కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఇంట్లో తండ్రి, సోదరులు, భర్త చెప్పినట్లు బతకాలి. బయటకు వస్తే ప్రభుత్వం పెట్టిన రూల్స్‌ పాటించి తీరాలి. ఎక్కడా స్వేచ్ఛ అనేదే లేని పరిస్థితి. కాదు కాదు అటువంటి దుర్భర దుస్థితి. ఇటువంటి ఆంక్షలతో జీవించారు ఇప్పటి వరకు ఇరాన్ మహిళలు. కానీ మార్పు మొదలైంది. ఓ మహిళ మరణంతో అది రణంగా మారింది. మహిళలకు,ప్రభుత్వానికి మధ్య రణం రాజుకుంది. హాయిగా ఊపిరి కూడా పీల్చుకోకుండా ఒళ్లంత కప్పేసే హిజాబ్‌. ఇష్టమున్నా.. లేకున్నా.. దాన్ని వేసుకోవాల్సిందే. హిజాబ్‌ ధరించడమే కాదు.. ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లోనే ఉండాలి. కాస్త అటూ.. ఇటైనా.. మొరాలిటీ పోలీసింగ్‌ పేరుతో నానా హింసలు పెడతారు. పోలీస్‌ కేసులు పెట్టి.. స్టేషన్లకు తీసుకెళ్లి అడ్డగోలుగా హింసిస్తారు. అమినీ విషయంలోనూ అదే జరిగింది. హిజాబ్‌ సక్రమంగా లేదన్న కారణంతో ఆమెను పోలీసులు బలి తీసుకున్నారు. కానీ.. ఆమె బలిదానం మాత్రం వృథా కాలేదు.

ఒక్కరికి వస్తే కోపం.. అదే కోపం ఓ గుంపుకు వస్తే ఉద్యమం.. ఆ ఉద్యమంలో లక్షల మంది పాల్గొంటే పెను విప్లవంగా మారుతుంది. ఇరాన్‌లో అదే జరిగింది. అమినీ మృతి మొదలైన నిరసనలు ప్రతి ఇంటికీ.. ప్రతి వీధికి పాకాయి. మొరాలిటీ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా మొదట్లో యువతులే ఎదురు తిరిగారు. ఆ తర్వాత మహిళలు వారికి అండగా నిలిచారు. ఆ ఉద్యమం మహోగ్రరూపం దాల్చడంతో పురుషులు కూడా తలొగ్గారు. మహిళలు హిజాబ్‌ ధరించాల్సిందేనని రూల్‌ పెట్టిన పురుషులే.. హిజాబ్‌ వ్యతిరేక పోరాటానికి మద్దతుగా నిలిచారు. చివరకు ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఇరాన్‌ టీమ్‌ సభ్యులు.. తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ జట్టు ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోతే.. జనం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంటే.. జనంలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అందుకే ప్రభుత్వం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో.. హిజాబ్ నిబంధనపై సమీక్ష నిర్వహించాలని తొలుత ఇరాన్ నిర్ణయించింది. తర్వాత సకల అరిష్టాలకు కారణం. మొరాలిటీ పోలీసు విధానమే అని గుర్తించి.. ఆ విభాగాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

IRAN Morality Police : ఇరాన్‌లో హిజాబ్ చట్టంలో మార్పులు చేస్తారా? పూర్తిగా రద్దు చేస్తారా? పార్లమెంట్, న్యాయవ్యవస్థల కసరత్తులు

ఇరాన్‌లో ప్రజావిప్లవంతో మొరాలిటీ పోలీసింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇరాన్‌లో షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన బాలికలు, మహిళలు తప్పనిసరిగా తలపై జుట్టు అంతా కప్పి ఉంచేలా ధరించాలి. ఆ చట్టాన్ని అమలు చేయడానికే మొరాలిటీ పోలీసింగ్‌ విభాగం ఏర్పాటైంది. డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించే వారిని అరెస్టు చేసే అధికారం ఇచ్చారు. ఇరాన్‌లో 1979లో ఇస్లామిక్ విప్లవం రాకముందు కఠినమైన డ్రెస్ కోడ్ ఉండేది కాదు. మహిళలు ఇష్టమొచ్చినట్లు దుస్తులు ధరించేవారు. పాత సినిమాల్ని చూసినా ఇది అర్థమవుతుంది. 1979కి ముందు ఇరాన్‌లో నైట్‌క్లబ్స్ ఉండేవి. వినోద కార్యక్రమాలు ప్రదర్శించేవారు. జనం వారికి నచ్చినట్లుగా జీవించేవారు. ఇస్లామిక్ విప్లవానికి ముందు లింగ విభజన కూడా లేదు. 1979 తర్వాత పాఠశాలల్లో జెండర్ పరమైన విభజన వచ్చింది. ఏ సంబంధం లేని ఇద్దరు ఆడ, మగ కలిసి తిరిగితే అరెస్ట్ చేయడం మొదలైంది. ఈ క్రమంలో మహిళలకు ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను చట్టబద్ధం చేశారు. ఆడవాళ్లు నిరాడంబరంగా ఉండే దుస్తులే ధరించాల..జుట్టు కనిపించకూడదని, శరీరం ఏమాత్రం కనిపించకుండా పొడవైన వస్త్రాలు ధరించాలంటూ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. 15 ఏళ్ల క్రితం దాకా నైతిక పోలీసులు ముందుగా హెచ్చరించేవారు. పట్టించుకోని మహిళలను అరెస్ట్‌ చేసేవారు.

ఆ తర్వాత క్రమంగా మరిన్ని కఠిన నిబంధనలు తెచ్చారు. వాటిని జనం పాటించేలా చూడటానికి 2006లో మొరాలిటీ పోలీసింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బలగాల పాత్రపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. ఇరాన్‌ అధ్యక్షులుగా చేసిన వారిలోనే దీనిపై భిన్నాభిప్రాయాలుండేవి. మహిళల దుస్తుల నిబంధనలు కూడా మారుతూ వచ్చాయి. ఆధునిక భావాలున్న అధ్యక్షుడు రౌహానీ హయాంలో మహిళలు బిగుతైన జీన్స్, రంగురంగుల హిజాబ్‌ ధరించే వీలు కల్పించారు. కానీ సంప్రదాయ భావాలున్న రైసి ఈ ఏడాది జూలైలో పగ్గాలు చేపట్టాక నిబంధనలు కఠినతరమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరి చేశారు. ఇరాన్‌కు శత్రుదేశమైన సౌదీ అరేబియా కూడా మహిళల డ్రెస్‌ కోడ్‌, ప్రవర్తనపై నిబంధనల అమలుకు మొరాలిటీ పోలీసుల్ని నియమించడం మొదలుపెట్టింది. అయితే, తీవ్ర విమర్శలు రావడంతో 2016 నుంచి మొరాలిటీ పోలీస్‌ విభాగాన్ని రద్దు చేసింది. ఇరాన్‌ మాత్రం మొరాలిటీ పోలీసింగ్‌ విభాగాన్ని కంటిన్యూ చేసింది. కానీ.. చివరకు ప్రజా ఉద్యమం దెబ్బకు తలొగ్గి ఆ డిపార్ట్‌మెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇరాన్‌ మహిళలు తమ స్వేచ్ఛ కోసం, వాక్‌ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడం కోసం వీధుల్లోకి రావడం మంచి పరిణామం అనే వాదన వినిపిస్తోంది. మిగతా ఇస్లాం దేశాల్లోని మహిళలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ముస్లిం మహిళా సమాజంలో సంస్కరణల కోసం ముందుకురావడాన్ని అంతా ఆహ్వానిస్తున్నారు. అయితే ఇరాన్‌లో మొరాలిటీ పోలీసింగ్‌ రద్దు చేయడం ఒక్కటే చాలదంటోంది అక్కడి మహిళా లోకం. హిజాబ్‌ నిబంధనే ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇష్టముంటే వేస్కోవచ్చు.. కానీ.. కంపల్సరీగా ధరించాలన్న రూల్‌ ఉండొద్దని నినదిస్తోంది. అప్పటిదాకా ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో హిజాబ్‌పై ఇరాన్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.