Donald Trump: డొనాల్డ్ ట్రంపును అరెస్ట్ చేశారా? సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు

ఒక పోర్న్ స్టార్‭కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (Former America Presedent) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మంగళవారం తాను అరెస్ట్ (Arrest) కావొచ్చని వారం క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంపును అరెస్ట్ చేశారా? సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు

is Donald Trump under arrest?

Updated On : March 22, 2023 / 6:26 PM IST

Donald Trump: ఒక పోర్న్ స్టార్‭కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (Former America Presedent) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మంగళవారం తాను అరెస్ట్ (Arrest) కావొచ్చని వారం క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి ఈ కేసు ఇంకా మొదటి విచారణలో ఉంది. అయితే ట్రంప్ ప్రకటనను ఉద్దేశిస్తూ.. ఆయన అరెస్ట్ అయినట్లుగా కొంతమంది ఎడిటెడ్ ఇమేజు(Edited Images)లు విడుదల చేశారు. అయితే సడెన్ గా వీటిని చూస్తే ట్రంప్ ను నిజంగానే అరెస్ట్ చేశారా అన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, వాటిల్లోని తీవ్రతను పరిశీలిస్తే అనుమానం కలుగక మానదు.

Uganda: స్వలింగ లైంగిక సంబంధాలు కొనసాగిస్తే మరణశిక్ష.. సంచలన చట్టం చేసిన ఉగాండా

ట్రంప్ అరెస్ట్ కోసం ఎదురుచూస్తూ.. అప్పటి వరకు ఫొటోల్లో ట్రంప్ అరెస్ట్ చూసుకుంటున్నారంటూ నెటిజెన్లు ఆ ఫొటోలను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తున్నారు. కొంత మంది పోలీసుల గుంపు ట్రంపును బలవంతంగా అరెస్ట్ చేస్తున్నట్లు ఉన్న ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న చిత్రాలను ఎలియట్ హిగ్గిన్స్(Eliot Higgins) అనే బ్రిటిష్ జర్నలిస్ట్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. ఈ చిత్రాలలో, ట్రంప్‌ను పోలీసులు అరెస్టు చేసి లాగడం చూడవచ్చు.

Karnataka Polls: ఎటూ తేల్చని బీజేపీ అధిష్టానం.. మళ్లీ ముఖ్యమంత్రి తానేనంటున్న బొమ్మై

కొన్ని చిత్రాల్లో పోలీసుల నుంచి ట్రంప్ పారిపోతున్నట్లు చూపించారు. మరికొన్ని చిత్రాల్లో ఆయన జైలులో ఉన్నట్లు కనిపించారు. అమెరికా ఖైదీలకు ఉపయోగించే కాషాయ రంగు బట్టలు వేసుకున్న ట్రంప్ ను, జైలు లోపల పనులు చేస్తున్నవి, జైలులో తీరిగ్గా కూర్చొని పుస్తకం చుదువుతున్నవి ఎలియట్ హిగ్గిన్స్ షేర్ చేశారు. ఇవి నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.