ఇటలీలో బద్దలైన అగ్నిపర్వతం, ఎగిసిపడ్డ లావా.. ఫస్ట్ టైమ్ కెమెరాకి చిక్కిన దృశ్యాలు

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 09:25 AM IST
ఇటలీలో బద్దలైన అగ్నిపర్వతం, ఎగిసిపడ్డ లావా.. ఫస్ట్ టైమ్ కెమెరాకి చిక్కిన దృశ్యాలు

ఇటలీలో అగ్నిపర్వతం(volcano) బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడింది. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు దట్టమైన పొగ వ్యాపించింది. ఇటలీలో అగ్నిపర్వతం బద్దలు కావడం, అందులో నుంచి లావా ఎగిసిపడటం కొత్తేమీ కాదు. కానీ, ఫస్ట్ టైమ్ అగ్నిపర్వతం బద్దలు, లావా ఎగిసిపడిన దృశ్యాలు కెమెరాకు చిక్కడం విశేషం. తెల్లవారుజామున సమయంలో జరిగిన ఈ ఘటనను కెమెరాల్లో బంధించారు. అగ్నిపర్వతం బద్దలైన సమయంలో ఎర్రని రంగులో నిప్పులా ఉప్పొంగుతూ బయటకు వచ్చిన లావా చాలా భయానకంగా ఉంది. ఆ దృశ్యాలు ఒళ్లుని గగుర్పాటకు గురి చేస్తాయి.

ఇది ఇలాలియన్ ఐల్యాండ్ లోని స్రామ్ బోలీ అగ్నిపర్వతం. ఇది చాలా యాక్టివ్ అగ్నిపర్వతం. నిత్యం బద్దలవుతూనే ఉంటుంది. కొన్ని సార్లు అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. చాలాసార్లు స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

రీసెంట్ గా జరిగిన ఘటన ఆదివారం(జూలై 19,2020) తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. అయితే పెద్దగా ఎవరూ చనిపోలేదు, గాయపడలేదు. పెద్దగా నష్టం కూడా జరగలేదు. కాగా, అగ్నిపర్వతం పేలుడు దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అగ్నిపర్వతం పై ప్రాంతంలో కెమెరాలు, వెబ్ క్యామ్స్ బిగించారు. వాటిలో పేలుడు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సుమారు 4 నిమిషాల పాటు లావా విరజిమ్మింది. ఈ పేలుడు శక్తివంతమైనదే, కానీ గత వేసవిలో జరిగిన దాంతో పోలిస్తే అంత శక్తివంతమైనది కాదని శాస్త్రవేత్తలు చెప్పారు.