Covid USA: అమెరికాలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉదృతి, అత్యవసరస్థితిని పొడిగించిన బైడెన్

కరోనా, ఓమిక్రాన్ రూపంలో మూడో దశలోనూ అమెరికాను అతలాకుతలం చేసింది. దీంతో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని దేశాధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు

Covid USA: అమెరికాలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉదృతి, అత్యవసరస్థితిని పొడిగించిన బైడెన్

Biden

Covid USA: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. మహమ్మారి మొదలైన నాటి నుంచి పలు దశల్లో తీవ్ర ప్రభావం చూపిన కరోనా, ఓమిక్రాన్ రూపంలో మూడో దశలోనూ అమెరికాను అతలాకుతలం చేసింది. దీంతో దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని దేశాధ్యక్షుడు బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మార్చి మొదటి వారం వరకు అమెరికా వ్యాప్తంగా Covid – 19 ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈసందర్భంగా శుక్రవారం దేశ ప్రజలనుద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో 9 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది మహమ్మారి తీవ్రతకు నిదర్శమని అన్నారు.

Also read: Europe Eunice storm : లండన్ లో రాకాసి గాలుల్లో కొట్టుకుపోతున్న జనాలు..ఊగిపోతున్న విమానాలు

అమెరికాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండేళ్ల క్రితం ఆరోగ్య అత్యవసర స్థితిని విధించి $50 బిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకెజీని ప్రకటించారు. అయితే ఆనాటి నుంచి దేశంలో పరిస్థితులు మార్పు లేవంటూ.. ప్రతినిధుల సభ దృష్టికి తీసుకువచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేయాలంటే మహమ్మారి పూర్తిగా అదుపులోకి రావాలని.. లేని పక్షంలో పొడింగించక తప్పదని బైడెన్ పేర్కొన్నారు.

Also read: Afghan Sikhs – Modi: అఫ్గాన్​ సిక్కు- హిందూ ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ

ఇదిలా ఉంటే.. అమెరికాలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలంటూ కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరుతుండగా..వారి సూచనలు కాదని బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఓమిక్రాన్ కారణంగా వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ, మనుషుల్లో తీవ్రత, మరణాల రేటు తగ్గిందని, దీంతో ఆయా దేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు పలు రాష్ట్రాల ప్రతినిధులు ఫెడరల్ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. కనీసం మాస్క్ ధరించే విషయంలోనూ, జన సంచారం, ఆఫీసు కార్యకలాపాలపైనా ఆంక్షలు తొలగించాలంటూ పలు రాష్ట్రాల గవర్నర్లు కోరుతున్నారు.

Also Read: India – UAE: మనకు బంగారు కడ్డీలు, వారికి ఆభరణాలు: దుబాయ్ – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం