India – UAE: మనకు బంగారు కడ్డీలు, వారికి ఆభరణాలు: దుబాయ్ – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి బంగారు కడ్డీలు (గోల్డ్ బార్లు) భారత్ లోకి, భారతదేశం నుండి ఆభరణాలు ఎగుమతికి సంబంధించి భారత్ - యూఏఈ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

India – UAE: మనకు బంగారు కడ్డీలు, వారికి ఆభరణాలు: దుబాయ్ – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం

India

India – UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి బంగారు కడ్డీలు (గోల్డ్ బార్లు) భారత్ లోకి, భారతదేశం నుండి ఆభరణాలు ఎగుమతికి సంబంధించి భారత్ – యూఏఈ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన “భారత్ – యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. ఇరు దేశాలు బంగారంపై సుంకం కోతలను గణనీయంగా తగ్గిస్తూ కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు వాణిజ్య కార్యదర్శి బివిఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ, “యూఏఈ నుంచి బంగారం దిగుమతిచేసుకునే దేశాల్లో భారత్ ప్రధమ స్థానాల్లో ఉందని అన్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారాన్ని యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటుంది. యూఏఈకి శాశ్వత ప్రాతిపదికన టారిఫ్ రేటు కోటా(TRQ) 200 టన్నులగా విధించగా, మిగతా ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసే సుంకంతో పోల్చితే ఇది ఒక శాతం తక్కువగా ఉంటుందని బివిఆర్ సుబ్రహ్మణ్యం వివరించారు.

Also read: 2023 IOC Session: జియో వరల్డ్ సెంటర్ వేదికగా 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సదస్సు

ఈ ఒక శాతం సుంకం తగ్గింపు.. బంగారు కడ్డీలలో ఎగుమతిలో యూఏఈకి ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుందని, తద్వారా బంగారం వాణిజ్యంలో యూఏఈ – భారత్ మధ్య బంధం బలోపేతం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో భారతీయ ఆభరణాలు సున్నా సుంకంతో యూఏఈ మార్కెట్లో ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం భారతీయ ఆభరణాలపై యూఏఈ 5 శాతం సుంకాన్ని విధిస్తుండగా, స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తే ఆ సుంకాన్ని ఎత్తివేయనున్నారు. ఇరుదేశాల మధ్య శుక్రవారం ఢిల్లీలో జరిగిన వాణిజ్య ఒప్పందాలు మే మొదటి వారంలో అమల్లోకి రానున్నాయి. అంతే కాదు అరబ్ దేశాల నుంచి దొడ్డిదారిలో వస్తున్న బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ “స్వేచ్చా వాణిజ్య ఒప్పందం” పనికొస్తుందని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు.

Also read: Aman Pandey : గూగుల్‌లో బగ్ కనిపెట్టాడు.. ఓవర్ నైట్లో కోటీశ్వరుడయ్యాడు..!

ప్రస్తుతం ఆభరణాలు, రత్నాల వ్యాపారాల్లో సింగపూర్, హాంగ్ కాంగ్ దేశాలు ప్రపంచ దేశాలకు ప్రవేశ ద్వారంగా ఉంటుండగా.. భారత్ – యూఏఈ మధ్య జరిగిన అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలతో.. అది భారత్ కు ప్రయోజనకరంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఏఈతో జరిగిన ఒప్పందం పై వాణిజ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ” ప్రపంచంలోని మిగిలిన దేశాలు, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా మరియు మధ్య ఆసియాలోకి ప్రవేశించడానికి దుబాయ్.. భారత్ కు ఒక ప్రవేశ స్థానంగా మారుతుందని” అన్నారు.