Whale Dead Body : తిమింగలం డెడ్‌ బాడీకి దగ్గరకెళ్లొద్దు..ప్రాణాలు పోతాయ్..!ఎందుకంటే..

తిమింగలం చనిపోయినా దాని చుట్టు పక్కల ఉంటే చాలా ప్రమదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దాని కళేబరానికి దూరంగా ఉండాలి లేదంటే ప్రాణాలు పోతాయట. ఎందుకంటే..

Whale Dead Body : తిమింగలం డెడ్‌ బాడీకి దగ్గరకెళ్లొద్దు..ప్రాణాలు పోతాయ్..!ఎందుకంటే..

Whale Fish  Dead Body very Danger

Whale Fish  Dead Body Very Danger  : తిమింగలం. సముద్రాల్లో జీవించే ఈ భారీ జీవి కళ్ల ఎదురుగా కనిపిస్తే భయంకరమైన భారీ షార్క్ చేపకు కూడా దడే. తిమింగలం సముద్రంలో జీవించే అన్ని జీవులకంటే పెద్దది. షార్క్ చేపల్ని కూడా గుటకాయస్వాహా చేసేస్తుంది. అటువంటి తిమింగలం అంటే అందరికి హడలే. ఏనుగు బతికినా చచ్చినా కోట్ల విలువే అన్నట్లుగా తిమింగంల బ్రతికి ఉన్నదానితో ఎంత ప్రమాదమో అది చనిపోయాక దాని కళేబరం అంటే దాని మృతదేహం కూడా అంతే ప్రమాదమట. చనిపోయిన తిమింగలం చుట్టు పక్కల ఎవ్వరు ఉన్నా వారి ప్రాణాలకు ప్రమాదమేనట…మరి చనిపోయిన తిమింగలంతో ఎందుకు ప్రమాదం అంటే..

సముద్రంలో నివసించే తిమింగలాలు కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి చనిపోయి ఒడ్డుకు కొట్టుకువస్తాయి. అలా కొట్టుకొచ్చి ఇసుకలో చిక్కుకుపోతాయి. భారీ ఆకారంలో ఉండే తిమింగలాన్ని చూడటానికి చాలామంది వస్తుంటారు. దాని చుట్టు తిరిగి అది చనిపోయిందని తెలుసుకున్నాక పిచ్చి పిచ్చి పనులు చేసేవారు లేకపోలేదు.సెల్ఫీలు తీసుకోవటం..దాని మీద పడుకుని ఫోటోలుతీసుకోవటం వంటివి చేస్తుంటారు. కానీ తిమింగలం చనిపోయింది కదాని దాని డడ్‌బాడీ దగ్గర ఉండటం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. దాని దగ్గరలో ఉంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే తిమింగలం డెడ్ బాడీ బాంబు లాగా ఒక్కసారిగా పేలుతుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారికి చాలా ప్రమాదం. ప్రాణాలు కూడా పోవచ్చు. కళేబరం ఎందుకు పేలుతుందంటే..

Read more : Whale Vomit: తిమింగలం 30కిలోల వాంతి.. రూ.10కోట్లు వచ్చిపడ్డాయ్!!

 ఎందుకు పేలుతుంది? దాని వల్ల ప్రమాదమేంటి?
ప్రతి సంవత్సరం వేలాది తిమింగలాలు చనిపోతున్నాయి.ప్లాస్టిక్ వ్యర్ధాలు వాటి కడుపులోకి వెళ్లి కావచ్చు. లేదా వృద్ధాప్యం వల్ల కావచ్చు. లేదా వేరే కారణాల వల్ల కావచ్చు.అలా చనిపోయిన తిమింగిలాలు కొన్ని సముద్రపు ఒడ్డుకు కొట్టుకువస్తాయి. తరువాత వాటి శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల అది పేలిపోతుంది. అందువల్ల దీని డెడ్‌ బాడీ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు. తిమింగలం చనిపోయిన కొద్ది రోజులకే తిమింగలం శరీర భాగాలు లోపల కుళ్ళిపోతాయి. ఏం జంతువైనా అంతే. అలా కుళ్లిపోవటం వల్ల శరీరం లోపల గ్యాస్ ఏర్పడుతుంది. ఆ గ్యాస్ లోపల భారీగా పెరిగితే అది పేలిపోతుంది. (ప్రెషర్ కుక్కర్ లాగా). తిమింగలం శరీరం బయటి పొర చాలా బలంగా ఉంటుంది. దీంతో వాయువులు శరీరం నుంచి బయటకు వెళ్లలేవు. అంతేకాదు రోజులు గడిచిన కొద్ది లోపల వాయువులు నిరంతరం తయారవుతూ ఉంటాయి. దాని నోరు కూడా మూసుకుపోతుంది. గ్యాస్ బయటకు రానిపరిస్థితి ఉంటుంది. దీంతో లోపల గ్యాస్ పెరిగి పెరిగి పెరుగుతుంటుంది.అది ఎలాగైనా ఎప్పుడైనా బయటకు రావాల్సిందే.అలా గ్యాస్ పెరిగి పెరిగి ఎప్పుడోకప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల మనుషులు ఎవ్వరున్నా వారికి ప్రమాదమే. ఆ గ్యాస్ బ్లాస్టింగ్ కు ప్రాణాలు పోతాయి. అందుకే తిమింగిలం కళేబరం చుట్టు పక్కల ఎవ్వరు ఉండకూడదు. అది ఎప్పుడు చనిపోయిందో. దాని లోపలి పరిస్థితి ఎలా ఉందో..ఎప్పుడు అది పేలుతుందో తెలియదు కాబట్టి..

Read more : Cute Video: పక్షితో తిమింగలం పిల్ల ఆటలు… 

అలా తిమింగలం చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు దాని చుట్టుపక్కల చూస్తే మాంసం ముద్దలు వెదజల్లి ఉంటాయి. దాని శరీరంలోని అన్ని భాగాలు పేలి బయటకు వచ్చి మీటర్ల కొద్దీ విరజిమ్మడబతాయి. టన్నులకొద్దీ బరువు ఉండే తిమింగలం శరీరం పేలినప్పుడు పరిస్థితి చాలా భారీగా దారుణంగా ఉంటుంది.ఇలా తిమింగలం చనిపోయాక ఒడ్డుకు కొట్టుకు వచ్చాక దాని శరీరం పేలిపోయిన ఘటనలుచాలానే ఉన్నాయి. కానీ ఎప్పుడు ప్రమాదం జరగలేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉండే కార్లు, ఇతర వాహనాలు మాత్రం దెబ్బతినడం జరిగింది. అంతే ఆ పేలుడు తీవ్రత ఎంతగా ఉంటే వాహనాలు దెబ్బతింటాయో అర్థం చేసుకోవచ్చు. వాహనాల పరిస్థితే అలా ఉంటే ఇక మనిషి ప్రాణం ఎంత? అందుకే చనిపోయిన తిమింగలాల చుట్టు పక్కలకు వెళ్లకపోవటం చాలా మంచిది. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు కదా..