రేవ్ పార్టీలో పట్టుబడ్డానంటూ వస్తున్న వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందన
Srikanth: శ్రీకాంత్ కూడా దీనిపై స్పందిస్తూ ఓ వీడియో రూపంలో మాట్లాడారు. తాను రేవ్ పార్టీలు..

srikanth
బెంగళూరులో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేసిన సంగతి విదితమే. ఇందులో తెలుగు నటులు కూడా పట్టుబడ్డట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగు నటుడు శ్రీకాంత్ కూడా పట్టుబడ్డట్టు వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు వస్తుండగా ముఖం కనిపించకుండా కప్పేసుకున్నాడు ఓ వ్యక్తి.
అతడు అచ్చం తనలా ఉండడంతో దీనిపై శ్రీకాంత్ టీమ్ స్పందించింది. రేవ్ పార్టీలో దొరికింది హీరో శ్రీకాంత్ కాదని స్పష్టం చేసింది. శ్రీకాంత్ హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పింది. అలాగే, శ్రీకాంత్ కూడా దీనిపై స్పందిస్తూ ఓ వీడియో రూపంలో మాట్లాడారు. తాను రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని చెప్పారు. తప్పుడు కథనాలను నమ్మవద్దని కోరారు.
దీంతో ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలను ఆయన నివృత్తి చేసినట్లయింది. ఇవాళ ఉదయం ఇంట్లో శ్రీకాంత్ ఉన్న సమయంలో ఆయన పేరు మీడియాలో రావడంతో ఆయన ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. తాను ఆ సమయంలో హైదరాబాదులోనే ఉన్నానని శ్రీకాంత్ చెప్పారు. బెంగళూరు వెళ్లలేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.
రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని నేను కాదు.. తప్పుడు కథనాలను నమ్మకండి
– Actor #SrikanthMeka pic.twitter.com/Zv18qwLWUK
— ???????? ????? (@BheeshmaTalks) May 20, 2024
Bangalore Rave Party lo RED HANDED ga dorikina #Janasena #JohnyMaster and other Janasena Tollywood artists….
— Sukkumarkk (@StrictlyAsking) May 20, 2024
Artist Hema : ఒరే బాబు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు..