గెలుపు ఎవరిది? మెజార్టీ ఎంత? ఏపీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ

ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. అభ్యర్థుల మెజార్టీపైనా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.

గెలుపు ఎవరిది? మెజార్టీ ఎంత? ఏపీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ

Ap Election Results : ఏపీ ఫలితాలపై ప్రధాన పార్టీల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ఆసక్తిగా ఓటర్లు కూడా ఎదురుచూస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. నిన్నటి వరకు ప్రచారంలో బిజీగా ఉన్న నేతలు ఇవాళ విదేశీ పర్యటనలో రిలాక్స్ అవుతున్నారు. విదేశాలకు వెళ్లినా ఫలితాలపై ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. అభ్యర్థుల మెజార్టీపైనా జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇంత ఉత్కంఠ, ఇంత పోటీ, ఇంత స్థాయిలో పోలింగ్ జరిగింది లేదు. ఏపీలో గతంలో జరిగిన ఎన్నికలు అన్నీ ఒక ఎత్తు, 2024లో జరిగిన ఎన్నికల మరొక ఎత్తు అన్నట్లుగా భావించాల్సిన పరిస్థితి. ప్రధాన పార్టీ అభ్యర్థులు అందరూ కూడా చావో రేవో తేల్చుకునేందుకు ఎన్నికల్లో రంగంలోకి దిగారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదారు నెలల ముందు నుంచి కూడా ఏపీలో ఎన్నికల వాతావరణం ఉంది. ఆ రోజు నుంచి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు రేపే ఎన్నికలు అన్నట్లుగా తలపడ్డారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. వారికి ఉన్న సర్వశక్తులను ఒడ్డి ఎన్నికల్లో నిలబడి ప్రచారం చేసి పోటీ చేశారు.

ఓటర్ల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పోలింగ్ శాతం ఏపీలో నమోదైన పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకు ప్లస్ అవుతుందని ఇటు కూటమి, అటు అధికార పార్టీ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. గెలుపు మాదంటే మది అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజం అవుతాయి? ఎవరి అంచనాలు తప్పుతాయి? అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

 

Also Read : పోలింగ్ శాతం పెరగడానికి కారణమిదే, విదేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం- మంత్రి పెద్దిరెడ్డి