Koo-Twitter: భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ ఖాతాను తొలగించిన ట్విట్టర్

భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’కు సంబంధించిన ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ట్విట్టర్ వంటి సైట్లకు పోటీగా ‘కూ’ మైక్రోబ్లాగింగ్ సైట్ ను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ న్యూ యార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలు సహా పలు మీడియా సంస్థలకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేయించారు. ఇదే సమయంలో ‘కూ’ ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా #ElonIsDestroyingTwitter ట్యాగ్ వాడుతూ ట్వీట్ చేశారు.

Koo-Twitter: భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ ఖాతాను తొలగించిన ట్విట్టర్

Indian Twitter alternative Koo App launched in Brazil, garners 1 million downloads already

Koo-Twitter: భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’కు సంబంధించిన ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ట్విట్టర్ వంటి సైట్లకు పోటీగా ‘కూ’ మైక్రోబ్లాగింగ్ సైట్ ను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ న్యూ యార్క్ టైమ్స్, సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలు సహా పలు మీడియా సంస్థలకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేయించారు. ఇదే సమయంలో ‘కూ’ ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం.

దీనిపై ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా #ElonIsDestroyingTwitter ట్యాగ్ వాడుతూ ట్వీట్ చేశారు. సమాచారాన్ని పోస్టు చేయడం నేరమేమీకాదని అన్నారు. జర్నలిస్టులు లింకులు పోస్ట్ చేస్తే తప్పేంటని నిలదీశారు. జర్నలిస్టులకు సమాధానం చెప్పకుండా తీసుకుంటున్న చర్యలు సరికాదని చెప్పారు.

మనకు అనుకూలంగా పాలసీలను రూపొందించుకోవడం ఏంటని అన్నారు. ట్విట్టర్ తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని విమర్శించారు. జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు. ట్విట్టర్ ఇకపై ఒక ప్రచురణకర్త అని, అంతేగానీ, ఓ వేదిక కాదని పేర్కొన్నారు.

మాస్టోడాన్ ఖాతాను నిషేధించడం, దాని లింకులు సురక్షితం కాదని అనడం, కూ ఖాతాను నిషేధించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు. ఎలాన్ మస్క్ కు మైక్రోబ్లాగింగ్ సైట్ పై ఇంకా ఎంత నియంత్రణ కావాలని నిలదీశారు. కాగా, ట్విట్టర్, టిక్ టాక్, ఫేస్ బుక్ వంటి సైట్లకు పోటీ ‘కూ’ నిలుస్తోంది. ‘కూ’ను వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

Ukraine War: మా గెలుపుతో లేదా ప్రపంచ వినాశనంతో యుద్ధం ముగుస్తుంది: పుతిన్ సలహాదారుడు