Lahore Most Poluted city :ఢిల్లీని మించిపోయింది..ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్

పాకిస్థాన్ లోని లాహోర్ నగరం ఢిల్లీని మించిపోయింది.ప్రపంచలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ తొలిస్థానంలో ఉంది.

Lahore Most Poluted city :ఢిల్లీని మించిపోయింది..ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్

Lahore Most Poluted City In World 

lahore most poluted city in World  : పాకిస్థాన్ లోని లాహోర్ నగరం ఢిల్లీని మించిపోయింది. శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీ అంటే కాలుష్యమే గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు ఢిల్లీని లాహోర్ దాటిపోయింది కాలుష్యంలో. అత్యంత కాలుష్యపూరిత నగరాల లిస్టులో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. కానీ లాహోర్ నగరం కాలుష్యంలో అంతకు మించి అంటోంది. లాహోర్ ప్రపంచంలో అత్యంత కాలుష్య లిస్టులో మొదటిస్థానంలో ఉంది.

ప్రపంచంలోనే పాకిస్తాన్‎లోని లాహోర్ అత్యంత కాలుష్య నగరమని లేలింది. గాలి నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ బుధవారం (నవంబర్ 17,2021) ఒక ప్రకటన చేసింది. లాహోర్‎లో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని..ఐక్యూ 300 కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాలుష్యంతో లాహోర్ లో భారీగా పొగమంచు కమ్ముకుంటుంది. పొగమంచు కారణంగా నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఐక్యూఎయిర్ పేర్కొంది. కాలుష్య తీవ్రతను లెక్కించి 348 వ ర్యాంకును ఇచ్చింది. చిన్నారులు కూడా కాలుష్యం బారిన పడి పలు వ్యాధులకు గురవుతున్నారు.

Read more : Delhi Air Pollution: టీవీ డిబేట్స్ కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి: సీజేఐ వ్యాఖ్యలు

పంట వ్యర్థాల దహనం,నాణ్యత లేని ఇంధనాలను కాల్చటం, శీతకాలంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు వంటి పలు కారణాలతో గత కొన్ని ఏళ్లుగా పాకిస్థాన్ లో వాయు కాలుష్యం తీవ్రతరమవుతోంది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన లాహోర్ నగరం కాలుష్యపరంగా చెత్త నగరాల జాబితాలో కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రజలు సొంతంగా ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. కాలుష్య తీవ్రత పెరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ పరిస్థితికి భారత్‌ కారణమని అక్కడి సర్కారు ఆరోపిస్తుంది. స్థానిక ప్రజలు గాలి కాలుష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు.గాలి గాలుష్యం కారణంగా స్థానికంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. కాలుష్యం వల్ల భారీగా పొగ మంచు కమ్ముకోవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది.

Read more : Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

‘‘పిల్లలు సైతం ఈ కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొంటున్నారని దీనికి పరిష్కారం కనుగొనండి” అని ముహమ్మద్ సయీద్ అనే ఓ కార్మికుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.మేము పేదవాళ్లం..శ్వాసకోస సంబంధ వ్యాధులతో పలు ఇబ్బందులు పడుతున్నాం. అనారోగ్యానికి గురవుతున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోదు. రోగాలతో ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్ ఛార్జీలు కూడా భరించలేని స్థితిలో ఉన్నాం అని ఓ అక్రమ్ అహ్మద్ అనే చిరు వ్యాపారి మీడియా వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు.

కాలుష్యాన్ని నియంత్రించమని మేం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. లాహోర్‌లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉందని నేను పలు పత్రికల్లో చదివాను.టీవీ వార్తల్లో వింటున్నాను. ఆ కాలుష్యాన్ని మేం అనుభవిస్తున్నాం..ఇది ఇలాగే కొనసాగితే, మేము చనిపోతాము. అయినా ప్రభుత్వం పట్టించుకోదు..నాకు మార్నింగ్ వాక్ చేయటం అలవాటు..నా పిల్లల్ని కూడా వాకింగ్ కు తీసుకొచ్చేవాడిని. కానీ శీతాకాలం వచ్చిదంటే చాలు కాలుష్యం పడగ విప్పుతుంది. దీంతో నాపిల్లలను బయటకు తీసుకురావటంలేదు..కాలుష్యం కాటుకు వారిని గురి అవుతారనే భయంతో..ఇంట్లో ఉన్నా మాస్కులు పెట్టుకోవాల్సి వస్తోంది సయీద్ అనే మరో వ్యక్తి వాపోయాడు.

Read more : Air Quality : వరుసగా నాలుగోరోజు..ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయుకాలుష్యం