Colombia Tragedy: కొలంబియాలో విషాదం.. భారీవర్షాలకు బురద, మట్టి ముంచెత్తడంతో 34మంది మృతి

కోలంబియాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వాయువ్య కొలంబియాలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తున్న బస్సును బురద, మట్టి ముంచెత్తడంతో బస్సు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు.

Colombia Tragedy: కొలంబియాలో విషాదం.. భారీవర్షాలకు బురద, మట్టి ముంచెత్తడంతో 34మంది మృతి

Colombia

Colombia Tragedy: కోలంబియాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వాయువ్య కొలంబియాలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తున్న బస్సును బురద, మట్టి ముంచెత్తడంతో బస్సు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు. సెంట్రల్ కొలంబియాలోని ప్యుబ్లోరికో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు సుమారు రెండు మీటర్ల ఎత్తున బురద, మట్టి పేరుకుపోయింది. బస్సు కొలంబియాలోని మూడవ అతిపెద్ద నగరమైన కాలి నుండి చోకో ప్రావిన్స్ లోని కాండోటో మున్సిపాలిటీకి వెళ్తోంది.

Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి

ఈ ప్రమాదంలో భాగంగా బస్సుతో పాటు కారు, ఓ ద్విచక్ర వాహనం సైతం మట్టిలో కూరుకుపోయింది. బస్సును బురద ముంచెత్తిన సమయంలో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. మరికొందరుసైతం ఆ రహదారి ప్రయాణిస్తున్న సమయంలో బురద, మట్టిలో కూరుకుపోయారు. 34 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీంతో తొమ్మిది మందిని సజీవంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఏడేళ్ల బాలిక మరణించిన తల్లిని అంటిపెట్టుకొని ఉన్నట్లు రిసరాల్డా గవర్నర్ విక్టర్ తమయో తెలిపారు.

Colombia Mudslide: కొలంబియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

ఈ విషాద ఘటన పట్ల అధ్యక్షుడు గుస్తావో ట్విటర్ సందేశంలో మృతుల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. పెట్రో, జాతీయ ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని, క్షతగాత్రులకు అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు. కొలంబియాలో పర్వత భూభాగంలో తరచుగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారింది. భవిష్యత్తు లో కొండచరియల ప్రమాదాలను నివారించేందుకు దేశం అడువుల పెంపకంపై దృష్టి సారిస్తుందని పర్యావరణ మంత్రి సుసానా మహమ్మద్ ట్విటర్ లో తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022లో భారీ వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో 216 మందికిపైగా మరణించారు. 5,38,000 మంది నిరాశ్రయులయ్యారు. దేశవ్యాప్తంగా ఇంకా 48మంది ఆచూకీ లభించలేదు.