Independence day: 1947 నుంచి ఇప్పటివరకు భారత్ ఎన్ని దేశాలతో, ఎన్ని యుద్ధాలు చేసింది? ఎన్నింట్లో ఓడింది?

భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో, చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. 1967లో చైనాపై భారత్ విజయం సాధించింది.

Independence day: 1947 నుంచి ఇప్పటివరకు భారత్ ఎన్ని దేశాలతో, ఎన్ని యుద్ధాలు చేసింది? ఎన్నింట్లో ఓడింది?

Independence day 2023

Updated On : August 12, 2023 / 3:00 PM IST

Independence day – 2023: భారత్ ఈ నెల 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. బ్రిటిష్ (British) పాలన నుంచి స్వేచ్ఛను పొందిన భారత్.. దాన్ని రక్షించుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన మిలటరీ శక్తిని సమకూర్చుకుంది.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో నాలుగో స్థానంలో భారత్ కొనసాగుతోంది. భారత్ శాంతికాముక దేశం.. అయినప్పటికీ మన భూభాగం జోలికి ఎవరైనా వస్తే చీల్చిచెండాడుతుంది. ఈ క్రమంలోనే భారత్ 1947 నుంచి ఇప్పటివరకు మొత్తం రెండు దేశాలతో ఆరు యుద్ధాలు చేసింది.

వాటిలో ఒక యుద్ధాన్ని ఘర్షణగానే చెబుతుంటారు. కేవలం ఒక్క యుద్ధంలోనే భారత్ ఓడిపోయింది. భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో, చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. 1967లో చైనాపై భారత్ విజయం సాధించింది.

1947-48 కశ్మీర్ యుద్ధం
దేశానికి స్వాతంత్ర్యం రాగానే పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడి యుద్ధానికి కారణమైంది. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు పాల్పడి కలకలం రేపింది. జమ్మూకశ్మీర్ తమ భూభాగమని చెప్పుకుంది. దీంతో భారత్-పాక్ యుద్ధం జరిగింది. 1947 అక్టోబరు 22 నుంచి 1949 జనవరి 5 వరకు యుద్ధం కొనసాగింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.

1962 చైనా-భారత్ యుద్ధం
సరిహద్దుల వద్ద చైనా ఆక్రమణలను అడ్డుకునేందుకు భారత్ యుద్ధం చేసింది. 1962 నవంబరు 21న ప్రారంభమైన యుద్ధం అదే ఏడాది అక్టోబరు 20న ముగిసింది. అక్సాయ్ చిన్, నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, అసోంలో ఈ యుద్ధం జరిగింది. చైనా గెలుపొందింది. భారత్ అరుణాచల్ ప్రదేశ్ లో భారీగా భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

1965 ఇండో-పాక్ యుద్ధం
కశ్మీర్ కోసం భారత్-పాకిస్థాన్ రెండోసారి యుద్ధం చేశాయి. 1965 సెప్టెంబరు 23 నుంచి ఏప్రిల్ 8 వరకు యుద్ధం జరిగింది. భూభాగాల్లో ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు.

1967 చైనా-భారత్ యుద్ధం
నాథు లా, చో లా ఘర్షణలు, చైనా-భారత్ ప్రతిష్టంభన, సైనో-ఇండియన్ వార్ అని కూడా అంటారు. సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1962 యుద్ధంలో గెలిచిన అహంకారంతో చైనా ఉంది. భారత్ ఈ సారి భీకరంగా పోరాడి, చైనాకు బుద్ధి చెప్పింది. నాథూ లా వద్ద ఇరు దేశాల సైన్యాలు గస్తీని పెంచాయి. 1967 సెప్టెంబరు 11 నుంచి 14 మధ్య నాథు లాలో ఘర్షణలు జరిగాయి. మళ్లీ అదే ఏడాది అక్టోబరు 1న చోలాలో ఇరు దేశాల సైనికులు ఘర్షణలకు దిగారు. భారత్ సైనికుల వీరోచిత పోరాటం ధాటికి చైనా సైన్యం వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

1971 ఇండో-పాక్ యుద్ధం
పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కోసం చేసిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. 1971 డిసెంబరు 3 నుంచి 16 వరకు ఈ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించింది భారత్.

1999 కార్గిల్ యుద్ధం
భారత్‌లోని కార్గిల్ ను ఆక్రమించుకునేందుకు పాక్ పన్నిన కుట్రను భారత్ తిప్పికొట్టింది. ఈ యుద్ధం 1999 జులై 26 నుంచి మే 3 వరకు జరిగింది. భారత సైనికుల పోరాటం ధాటికి పాక్ తోకముడుచుకుంది.

Independence Day 2023: శత్రు దేశాలను వణికించడానికి భారత్ ఎన్ని రూ.లక్షల కోట్లు ఖర్చుచేస్తోంది? టాప్-10 దేశాలు ఏవి?

Independence Day 2023: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆసక్తికర కథనాలు