Home » International » బాలుడి చెంపపై బల్లి ముద్ర..ఎలా వచ్చిందబ్బా ?
Updated On - 4:47 pm, Fri, 26 February 21
dead lizard : ఓ బాలుడి చెంపకు బల్లి ముద్ర ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ బల్లి ముద్ర ఎలా వచ్చిందనే దానిపై తెగ చర్చించుకుంటున్నారు. తన చెంపను చూసుకున్న బాలుడు ఏం జరిగిందని ఆశ్చర్యపోయాడు. చివరకు విషయం తెలిసిన వారు నవ్వుకున్నారు. ఈ ఘటన చైనా దేశంలో చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగింది ?
పాఠశాలకు వెళ్లాలంటే..హోం వర్క్ చేయాలంటే…చిన్న పిల్లలకు ముందుగా వచ్చేది నిద్ర. కొంతమంది పాఠశాలల్లో నిద్రపోతుంటారు. అలాగే..హోం వర్క్ చేస్తూ..ఘాడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలాగే..చైనాకు చెందిన ఓ బాలుడు..హోం వర్క్ చేసుకుంటూ..అమాంతం బుక్ పైనే నిద్రపోయాడు. అనంతరం నిద్ర లేచిన అనంతరం చెంపపై ఏదో ఉన్నట్లు అనిపించింది.
అద్దంలో చూడగా…బల్లి ముద్ర ఉండడంతో ఆశ్చర్యపోయాడు. ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. తన పుస్తకాన్ని చూశాడు. చచ్చిపోయిన బల్లి ఉంది. బల్లిపైనే పడుకోవడంతో అతడి బరువుకు చనిపోయింది. ఆ బల్లి అచ్చు పిల్లాడి చెంపపై పడింది. దీనికి సంబంధించిన ఫొటో jackson Lu ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది.
你寫作業打瞌睡還沒關係,你連睡在死壁虎上都沒有感覺是嗎? 😂😂😂😂😂 pic.twitter.com/DUhRkhLdUJ
— jackson Lu (@menlin_fitri) February 21, 2021
Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది
రక్తపుమడుగులో భార్యాభర్తలు.. శరీరాలపై కత్తిపోట్లు.. బాల్కనీలో చిన్నారి.. అమెరికాలో భారత జంట అనుమానాస్పద మృతి..
Dog Attack : తల్లిదండ్రుల వెన్నులో వణుకుపుట్టించే ఘటన.. దయచేసి మీ పిల్లలను ఒంటరిగా వదలొద్దు..
Madhya Pradesh : హోలీ పండుగ రోజు..మందు దొరక్క శానిటైజర్ కలుకుని తాగారు..ఇద్దరు మృతి..మరొకరి పరిస్థితి విషమం
boy died : ప్రాణం తీసిన ఈత సరదా…
దేవాలయంలో నీళ్లు తాగాడని దారుణంగా దెబ్బలు తిన్న బాలుడికి రూ.10లక్షల సాయం