World Tallest Cycle guinness Record: వాడి పారేసిన వస్తువులతో ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌.. గిన్నిస్ బుక్‌ రికార్డ్

ఆడమ్‌ జ్డానోవిచ్‌ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను తయారు చేశాడు. వాడి పారేసిన వస్తువులతో తయారుచేసిన ఈ సైకిల్ కు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

World Tallest Cycle guinness Record: వాడి పారేసిన వస్తువులతో ప్రపంచంలోనే పొడవైన సైకిల్‌.. గిన్నిస్ బుక్‌ రికార్డ్

World's Tallest Rideable Cycle Guinness World Record

World’s Tallest Rideable Cycle guinness World Record : ఆడమ్‌ జ్డానోవిచ్‌ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను తయారు చేశాడు. వాడి పారేసిన వస్తువులతో ఈ భారీ సైకిల్‌ తయారు చేశాడు ఆడమ్. ఈ సైకిల్ ప్రపంచంలోనే అత్యం పొడవైనది కావటం ఓ విశేషమైతే..వాడి పారేసిన వస్తువులతో తయారుచేయడం మరో విశేషం. ఈ సైకిల్ గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకోవటం ఇంకో విశేషం.

ఆడమ్‌ జ్డానోవిచ్‌ రీసైక్లింగ్ వస్తువుల్ని సేకరించి 24 అడుగుల 3 అంగుళాలు కలిగిన ఈ సైకిల్ ప్రపచంలోనే అతి పొడవైన సైకిల్‌ గా గుర్తింపబడింది. ఆడవ్ తను తయారు చేసిన ఈ సైకిల్‌ను రైడింగ్ చేస్తున్న దృశ్యాన్ని గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఆడమ్‌ జ్డానోవిచ్‌ ఏ దేశానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలపలేదు. ఈ సైకిల్‌ను చూసిన నెటిజన్లు అబ్బురపడుతు ఆడమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తనకు పెద్దపెద్ద ప్రాజెక్టులు చేయడమే ఇష్టమని..తన ఆలోచనలు కూడా ఎప్పుడూ పెద్దస్థాయిలోనే ఉంటాయని గిన్నిస్ రికార్డు సాధించిన ఈ భారీ సైకిల్ సృష్టికర్త ఆడమ్ తెలిపాడు. ఈ సైకిల్ తయారు చేయటానికి నెల రోజులు పట్టిందని తెలిపాడు. కాగా ఈ సైకిల్ ఆడమ్ ఎలా ఎక్కాడు? అనేది పెద్ద ప్రశ్నే. భూమికి 24 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సైకిల్ ఎక్కటం..తొక్కటం అంటే బిగ్గెస్ట్ టాస్కే అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Guinness World Records (@guinnessworldrecords)