Strange incident : కారులోంచి కోట్ల రూపాయలు విసిరేసిన వ్యక్తి.. ఇక రోడ్డుపై పరిస్థితి ఎలా ఉంటోందో ఊహించండి…

నడిరోడ్లపై నోట్ల కట్టలు కనిపిస్తే జనాలు ఆగుతారా? అమెరికాలో ఒకాయన కోట్ల రూపాయలు తన కారులోంచి హైవేపైకి విసిరేశాడు. ఇక అక్కడి పరిస్థితి ఒకసారి ఊహించండి.

Strange incident : కారులోంచి కోట్ల రూపాయలు విసిరేసిన వ్యక్తి.. ఇక రోడ్డుపై పరిస్థితి ఎలా ఉంటోందో ఊహించండి…

Strange incident

ఎక్కడైనా రోడ్డుపై ఒక కరెన్సీ (currency) నోటు కనపడితేనే ఎవరు తీసుకుందామా అని పరుగులు పెడతారు. అలాంటిది దాదాపుగా రెండు కోట్ల రూపాయల నోట్లు రోడ్డుపై కనిపిస్తే జనం ఎలా పరుగులు పెడతారో? ఊహించండి. యూఎస్ లో ఒకాయన రోడ్డుపై విసిరేసిన కరెన్సీ నోట్ల కోసం జనం పరుగులు పెట్టారు.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

యూఎస్ ఒరెగాన్‌లో (Oregon) రద్దీగా ఉండే హైవే. కొలిన్ డేవిస్ మెక్‌కార్తీ (Colin Davis McCarthy) అనే వ్యక్తి కారులో హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆల్రెడీ తాను $100 బిల్లుల స్టాక్‌ల ద్వారా విత్ డ్రా చేసిన మొత్తం సొమ్ము $200,000 తన కారు కిటికీలోంచి బయటకు విసిరేసాడు. ఆ అమౌంట్ మొత్తం ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 1 కోటి 60 లక్షల రూపాయలు. ఇదేంటి? ఈ మనిషికి పిచ్చి పట్టిందా అనుకుంటున్నారు కదా.

అతనికి ఫ్యామిలీ మెంబర్స్‌తో జాయింట్ అకౌంట్ ఉందట. అయితే ఆ అకౌంట్ లోంచి వారు డబ్బు మొత్తం దోచేస్తుండటం కొలీన్‌కి కోపం తెప్పించిందట. అందుకే ఆ డబ్బుని విత్ డ్రా చేసి జనానికి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడట. అందుకే అలా రోడ్ పై విసిరేసాడని తెలుస్తోంది. యూజీన్ (Eugene) నగరంలో ఏప్రిల్ 11న రాత్రి 7.20 గంటల ప్రాంతంలో కొలిన్ డబ్బు విసిరినట్లు ఒరెగాన్ పోలీసులు చెబుతున్నారు. ఇక నడిరోడ్డుపై నోట్ల కట్టలు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అటువైపుగా వెళ్తున్న వాహనదారులంతా కారులు ఆపి డబ్బుల వేటలో పడ్డారు.

Woman walked on the river : నర్మదా నదిపై నడుచుకుంటూ వెళ్లిన వృద్ధురాలు .. దేవత అంటూ ప్రచారం.. వీడియో వైరల్

ఇక కొలిన్ విచిత్రమైన స్టంట్ చేయడం కోసం తమ జాయింట్ అకౌంట్ లోంచి డబ్బులు తీసివేసాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. డబ్బును తీసుకున్నవారు దయచేసి తిరిగి ఇవ్వాల్సిందిగా రిక్విస్టె చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ పోలీసులు కొలిన్‌ను అయితే అరెస్ట్ చేయలేదు. చేతిలోంచి పడిపోయిన సెల్ ఫోన్, డబ్బులు ఎవరైనా తిరిగి ఇచ్చేసిన సంఘటనలు మనం అరుదుగా చూస్తాం. అంత డబ్బు కళ్ల చూసిన వారు తిరిగి ఇవ్వడం అంటే అయ్యే పని కాదు. కానీ కొలిన్‌పై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అనేది చూడాలి.