కరోనానే కాదు.. ఇంకో కొత్త వైరస్ వచ్చింది

కరోనానే కాదు.. ఇంకో కొత్త వైరస్ వచ్చింది

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్  దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్రం అవుతుండటంతో జబ్బు కన్ఫామ్ అవకముందే కరోనా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. 

జబ్బు ఒకటి అయితే మందొకటి వేస్తే లాభం ఉండదు కదా. ట్రీట్మెంట్ పనిచేయక ప్రాణాలు వదిలాడు. మలేసియాలో ఇప్పటికే 25 మంది కరోనా వైరస్‌కు గురైనట్లు వైద్యులు తేల్చారు. అదే అనుమానంతో మలేసియా నుంచి వచ్చిన వ్యక్తికి టెస్టులు చేయడంతో రిపోర్టుల్లో వైరస్ లేదని నెగెటివ్‌గా వచ్చింది. 

కరోనా వైరస్ తొలిసారి చైనాలోని వూహాన్‌లో వచ్చింది. కేరళవాసి మృతి చెందడం పట్ల వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. అతనికి షుగర్ ఉందని.. రక్త నమూనాలతో ఇతర పరీక్షలు జరిపి మృతికి కారణాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2,978మంది బలవ్వగా… బాధితుల సంఖ్య 87వేలకు చేరింది. చైనాతోపాటు ఇతర దేశాల్లోను బాధితులు, మృతుల సంఖ్య పెరుగోతంది. ఆస్ట్రేలియాలో కరోనా కారణంగా తొలి మరణం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ సహా పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీని జారీచేయగా.. మక్కా సందర్శనకు వచ్చే విదేశీ యాత్రికులను సౌదీ తాత్కాలికంగా నిషేధించింది.

చైనాలోని కరోనా బాధితుల్లో నిన్న 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2వేల870కి చేరింది. చైనాలో ఇప్పటివరకు 79వేల826  కరోనా కేసులు నమోదవగా… అందులో 41వేల825మంది కోలుకున్నారు. 7వేల 365 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

ఇటలీలోను ఈ మహమ్మారి యమపాశం విసురుతోంది. ఆ దేశంలో ఇప్పటికే 29మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక్కడ ఒకవెయ్యి 128 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాతోపాటు… దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. సౌత్ కొరియాలో మొత్తం 3వేల 526 కేసులు నమోదవగా.. ఇప్పటికే 17 మంది చనిపోయారు. మరో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. 

ఇరాన్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 43 మంది చనిపోగా ప్రస్తుతం 593 మంది కరోనా సోకి బాధపడుతున్నారు. జపాన్‌లోని యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని ఆరుగురిని కూడా కరోనా బలి తీసుకుంది. నౌకలో మొత్తం 705 మందికి కరోనా సోకగా…  10మంది కోలుకున్నారు. మరో  36 మంది ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తేల్చారు.