Viral video: భారీ భూకంపం సంభవిస్తే రోడ్లు ఎలా కదులుతాయో తెలుసా..? ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..

భారీ భూకంపం సంభవిస్తే రోడ్డుపై వెళ్లే వాహనాలు, రహదారి పక్కన ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ ఎలా ఊగుతాయో మీరెప్పుడైనా చూశారు. భూకంపం దాటికి రోడ్డుపై వెళ్లే వాహనాలు ఒకదానిపైకి ఒకటి దూసుకెళ్లడం మీరెప్పుడైనా చూశారు. ఇలాంటి భయానకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడితో పాత వీడియో కాదు.. గురువారం దక్షిణ పెరూలో భారీ భూకంపం సంభవించింది...

Viral video: భారీ భూకంపం సంభవిస్తే రోడ్లు ఎలా కదులుతాయో తెలుసా..? ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..

Peru

Viral video: భారీ భూకంపం సంభవిస్తే రోడ్డుపై వెళ్లే వాహనాలు, రహదారి పక్కన ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ ఎలా ఊగుతాయో మీరెప్పుడైనా చూశారు. భూకంపం దాటికి రోడ్డుపై వెళ్లే వాహనాలు ఒకదానిపైకి ఒకటి దూసుకెళ్లడం మీరెప్పుడైనా చూశారు. ఇలాంటి భయానకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం దక్షిణ పెరూలో భారీ భూకంపం సంభవించింది. దీంతో రహదారులు, భవనాలు కదిలాయి. రోడ్లపై వాహనాలుసైతం అదుపు తప్పాయి. ఈ ఘటన సీసీ పుటేజిల్లో రికార్డయింది. Justin Hart (జస్టిన్ హార్ట్) అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విటర్ లో పోస్టు చేశాడు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

దక్షిణ పెరూలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రత ఉన్నట్లు నమోదైంది. అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్వంగా 8మైళ్ల దూరంలో, 217 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. భూకంపం వచ్చినప్పుడు, రోడ్లు, భవనాలు కదిలాయి. రోడ్లు ఒక్కసారిగా ఊగడంతో వాహనాలు అదుపుతప్పి ఒకదానిపైకి ఒకటి దూసుకెళ్లాయి. ఈ హఠాత్ పరిణామంతో భయాందోళన చెందిన వాహన దారులు బయటకు దిగి ఏం జరుగుతుందో ఆరా తీసే ప్రయత్నం చేశారు. కొద్ది సెకండ్ల తరువాత భూమికంపించడం ఆగిపోవటంతో అప్పుడు అర్థమైంది.. భారీ భూకంపం సంభవించిందని.

Earthquake : అండమాన్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు

భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. దక్షిణ ప్రాంతాలైన ఆరేక్విపా, కుస్కో, టక్నాల్లో భూకంపం వచ్చింది. దీంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. పెరూలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే గురువారం సంభవించిన భూకంపంతో భవనాలు, రహదారులు ఊగిపోయాయి. ఈ ఘటనలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.