WHO Warns On Monkeypox : విపరీతంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్క్‌ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

WHO Warns On Monkeypox
WHO Warns On Monkeypox : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్క్‌ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసులు కాస్త తగ్గినట్లు అనిపించినా జాగ్రత్తలు తీసుకోవడం ఆపొద్దని సూచించింది. గతవారం మంకీపాక్స్ కేసులు పెరిగిన దేశాల్లో.. అమెరికా కాంటినెంట్ దేశాలున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సైతం హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఇది ఈ అంటువ్యాధికి అత్యంత ప్రమాదకరమైన సమయం కావచ్చు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గముఖం పడుతుండగా.. గతవారం 21 దేశాల్లో కేసులు పెరిగాయని తెలిపారు. అమెరికా ఖండంలోని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 90శాతం గుర్తించారు.
Monkeypox to pet dogs: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల నుంచి కుక్కకు సోకిన మంకీపాక్స్
మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టే సమయం అత్యంత ప్రమాదకరమని టెడ్రోస్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సమయంలో వైరస్ తగ్గిందని భావించి జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తామని.. దీంతో మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పరీక్షల సామర్థ్యం పెంచడంతోపాటు నిఘా వ్యవస్థను మెరుగుపరిచేందుకు డబ్ల్యూహెచ్ వో కృషి చేస్తుందని చెప్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.