Monkeypox : మంకీపాక్స్ సోకిన వారు మూడు వారాలు వీటికి దూరంగా ఉండాలి

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ వల్ల ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సూచనలు మేరకు వైద్యులు కీలక సూచనలు చేశారు.

Monkeypox : మంకీపాక్స్ సోకిన వారు మూడు వారాలు వీటికి దూరంగా ఉండాలి

monkeypox

Monkeypox : ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ వల్ల ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సూచనలు మేరకు వైద్యులు కీలక సూచనలు చేశారు. మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ సోకిన వారు మూడు వారాల పాటు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని సూచించారు. పెంపుడు జంతువుల ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుందనే హెచ్చరికల నేపద్యంలో వైద్యులు ఈ దిశగా మార్గదర్శకాలు జారీ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 దేశాల్లో 200 కి పైగా మంకీ పాక్స్ కేసులు బయట పడ్డాయి. ఇన్ ఫెక్షన్ సోకిన వారిలో ఎక్కువ మంది జ్వ‌రం, వ‌ళ్లునొప్పులు, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలతో బాధ పడుతున్నారు. తీవ్ర అస్వ‌స్ధ‌త‌కు లోనైన వారిలో ముఖంతో  స‌హా శ‌రీర భాగాల్లో ద‌ద్దుర్లు, దుర‌ద వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ఎలుక‌లు, కోతుల వంటి జంతువుల్లో గుర్తించిన‌ వైర‌స్ నుంచి ఈ వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ ప్ర‌బలుతున్న‌ట్టు వైద్యనిపుణులు గుర్తించారు. ఈ వైర‌స్ మ‌ధ్య‌, ప‌శ్చిమాసియాలో ఎండెమిక్ ద‌శ‌కు చేర‌గా బ్రిట‌న్‌, అమెరికా, ఇజ్రాయిల్‌, ఫ్రాన్స్ వంటి దేశాల్లో విస్త‌రిస్తోంది.

ఇన్ఫెక్ష‌న్స్‌ను గుర్తించి నియంత్రించేందుకు ఎలుక‌లతో స‌హా పెంపుడు జంతువుల‌ను ప‌రీక్షించి మూడు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచాల‌ని ముఖ్యంగా వాటితో స‌న్నిహితంగా మెలిగే వారు ఈ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని బ్రిట‌న్ ఆరోగ్య భ‌ద్ర‌తా ఏజెన్సీ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. పెంపుడు జంతువులకు ఆహారం అందించటం, వాటిని శుభ్రం చేయటం వంటి పనులన్నీ మానేసి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.