Covid Test : భారత్‌లోకి అడుగు పెట్టాలంటే ఆ సర్టిఫికెట్‌ తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం

కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది.

Covid Test : భారత్‌లోకి అడుగు పెట్టాలంటే ఆ సర్టిఫికెట్‌ తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం

Covid Test

Covid Test : కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది. కొన్ని రోజులుగా ఆయా దేశాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కోవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారంతా నెగెటివ్‌ రిపోర్ట్‌ ను సమర్పించాల్సి ఉంటుందని, సర్టిఫికెట్‌ ఇవ్వకుంటే విమానంలోకి అనుతించవద్దని ఎయిర్ పోర్టు అధికారులను ఆదేశించింది. ప్రయాణికులంతా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌ (SDF) నింపి, ప్రయాణానికి ముందు ఆన్‌లైన్‌ ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో (www.newdelhiairport.in) సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ను సైతం అప్‌లోడ్‌ చేయాల్సి స్పష్టం చేసింది.

Rose Tea : బరువును తగ్గించే రోజ్ టీ

నిబంధనలు పాటించకుంటే క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు బాధ్యులవుతారని హెచ్చరించింది. ‘ఏ’ కేటగిరి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు టీకా సర్టిఫికెట్‌ను పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని, ప్రయాణికులందరూ తమ మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌, కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ అప్‌లోడ్‌ చేసిన ప్రయాణికులకు మాత్రమే విమానయాన సంస్థలు బోర్డింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. విమానం ఎక్కే సమయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు సైతం చేయనున్నారు.