Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

ఒమిక్రాన్‌ BA-4, BA-5 సబ్ వేరియంట్లు మునుపటి BA-2 సబ్ వేరియంట్ కంటే ఎక్కువ వ్యాప్తిని కనిపిస్తున్నాయని, ఇది అసలు ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు...

Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

Omicron Sublineages

Omicron sub variants: ఒమిక్రాన్‌ BA-4, BA-5 సబ్ వేరియంట్లు మునుపటి BA-2 సబ్ వేరియంట్ కంటే ఎక్కువ వ్యాప్తిని కనిపిస్తున్నాయని, ఇది అసలు ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్పారు. దక్షిణాఫ్రికాలోని తొమ్మిది ప్రావిన్సులలో ఏడు, ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలలో సబ్‌ వేరియంట్లు కనుగొన్నారు. ఈ నెలలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాక్సిన్‌, సహజ రోగనిరోధక శక్తిని తప్పించుకోగలవని జీన్ సీక్వెన్సింగ్ యూనిట్ల అధిపతి చెప్పారు. BA-4, BA-5 సబ్ వేరియంట్లు మునుపటి BA-2 వేరియంట్ కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తిని పెంచుతున్నట్లుగా కనిపిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి తులియో డి ఒలివేరా చెప్పారు.

Omicron BA.2.12.1 : ఢిల్లీ కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్.. కొత్త కేసులకు కారణమిదేనా?

రోగనిరోధక శక్తినిసైతం దాటుకొని వచ్చేలా ప్రస్తుతం ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్లు ఉన్నాయని, ఇది మళ్లీ వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని, ఇది కొన్ని వ్యాక్సిన్‌లను విచ్ఛిన్నం చేయగలదని మేము ఆశిస్తున్నామని డి ఒలివేరా చెప్పారు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో కేసులు పెరగడానికి ఇదే ఏకైక మార్గం అన్నారు. ఇక్కడ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది రోగనిరోధక రక్షణ స్థాయిని కలిగి ఉన్నారని మేము అంచనా వేస్తున్నామని తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్, దాని సబ్‌ వేరియంట్లు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రభావం చూపగలవు అనడానికి దక్షిణాఫ్రికా కీలకమైన సూచనగా పరిగణించబడుతుందని అన్నారు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా శాస్త్రవేత్తలు నవంబర్‌లో ఒమిక్రాన్‌ను కనుగొన్నారు. సబ్ వేరియంట్ ఫలితంగా కొవిడ్ వ్యాప్తి పెరుగుదలను ఎదుర్కొన్న మొదటి దేశం దక్షిణాఫ్రికా.

Omicron New Variant XE : ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు

దక్షిణాఫ్రికాలో 70% కొత్త కరోనావైరస్ కేసులకు కొత్త సబ్ వేరియంట్లు కారణంగానే నమోదయ్యాయని డి ఒలివేరా ట్విట్టర్ల వేదికగా తెలిపారు. ఒమిక్రాన్ BA-4, BA-5 సబ్ వేరియంట్లు కొవిడ్ వ్యాప్తిని పెంచుతుందని, కానీ భారీగా ఆస్పత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం వంటి తీవ్రస్థాయిలో వ్యాప్తి ఉండదని డి ఒలివేరా తెలిపారు. దక్షిణాఫ్రికాలో గురువారం 18.3% టెస్ట్ పాజిటివ్ రేటుతో 4,146 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మార్చి 28న 581 కేసులతో, సానుకూలత రేటు 4.5%తో పోల్చబడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆస్పత్రులు, మరణాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ అవి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.