Omicron New Variant XE : ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు

ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్‌తో ‘XE Omicron’ అనే పేరుతో ఈ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది.

Omicron New Variant XE : ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు

Omicron New Varint

Omicron’s new variant XE : కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ మరో కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బెంబేలిత్తించిన ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. యూకేలో జనవరి 19న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలిసారిగా బయటపడింది.

376 శాంపిల్స్ ను జీనమ్ పరీక్షించగా అందులో ఒకటి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XEగా తేలింది. మరొకటి కప్పా వేరియంట్ గా గుర్తించారు. కరోనా అన్ని వేరియంట్లలోనూ ఒమిక్రాన్ XE అత్యంత వేగంగా వ్యాపించే గుణం కలిగివుందని గుర్తించారు. ఒమిక్రాన్ అన్నింటికంటే వేగం అనుకుంటే ఈ కొత్త రకం దానికి మించిపోయింది. ఇది మొదటిసారి ఈఏడాది జనవరిలో ఇంగ్లాండ్ లో బయటపడింది. కరోనాలోని రెండు, మూడు వేరియంట్లు కలవడంతో ఇది పుట్టుకొచ్చింది.

Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ని మొద‌ట‌గా గుర్తించి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా?

అసలైన కరోనా స్ట్రెయిన్ కు స్టెల్త్ ఒమిక్రాన్ కలిచిందని నిపుణులు తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది 10 శాతం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఆంక్షలు తొలగిపోతున్నాయి. ఈ సమయంలో ముంబైలో ఈ ఒమిక్రాన్ XE బయటపడటం కలకలం రేపుతోంది. ర్యాండమ్ గా నిర్వహించే జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

ఒమిక్రాన్‌ స్ట్రెయిన్స్ (BA1, BA2) కాంబినేషన్‌తో ‘XE Omicron’ అనే పేరుతో ఈ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్ గుర్తించింది. ఈ వైరస్ వ్యాప్తి మూడో కరోనా వేవ్ కన్నా 10 రెట్లు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ కొత్త వైరస్‌కు సంబంధించి ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదైనట్లు WHO హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ యూకేలో జనవరి 19న తొలిసారిగా బయటపడింది. ఈ వైరస్‌కు సంబంధించి లక్షణాలను నిపుణులు వెల్లడించారు.

Omicron New Variant : కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా మూడు హైబ్రిడ్ కోవిడ్ వేరియంట్లు (XD, XF, XE) వ్యాప్తి చెందుతున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇంతకీ కొత్త వైరస్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. కరోనా వ్యాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్నవారిని బట్టి, అలాగే వారిలో రోగనిరోధక శక్తి స్థాయి ఆధారంగా ఒక్కొక్కరిలో ఒక్కొలా వైరస్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు.

ప్రధానంగా ఈ కొత్త వైరస్ సోకిన బాధితుల్లో ముందుగా జ్వరం, గొంతు నొప్పి, గొంతులో మంట, దగ్గు, జలుబు, చర్మం రంగు మారడం, చర్మం దురద, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు ఉంటున్నాయని గుర్తించారు. అలాగే ఈ వైరస్ తీవ్రత పెరిగితే.. వారిలో గుండె జబ్బులు, గుండెదడ, నరాల్లో తీవ్ర అనారోగ్యం వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.