Omicron : భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు..8 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు

క్షణక్షణం భయంభయం..! గంట గంటకు పెరుగుతున్న కేసులు..! మరోసారి ఆంక్షల వలయంలోకి ప్రపంచదేశాలు..! ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది.

Omicron : భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు..8 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు

Omicron

New variant Omicron : క్షణక్షణం భయంభయం..! గంట గంటకు పెరుగుతున్న కేసులు..! మరోసారి ఆంక్షల వలయంలోకి ప్రపంచదేశాలు..! ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సృష్టిస్తోన్న కలకలం. ఒమిక్రాన్‌ భయం గుప్పిట్లో ప్రపంచదేశాలు వణుకుతున్నాయి. ఆఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్‌ ఉదృతి ఖండాంతారలు దాటి యూరప్‌లోకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే యూకే, జర్మనీ, ఇటలీలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు కళ్లు తెరవకుంటే కబళించేందుకు ఒమిక్రాన్‌ సిద్ధంగా ఉంది. ప్రపంచానికి ఇదే వేక్‌ఆప్‌ కాల్‌ అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్. మాస్కులు ధరించడం మరవద్దన్నారు. గుమిగూడితే గండం తప్పదంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే 8దేశాలకు పాకిందీ ఈ వేరియంట్‌

ఒమిక్రాన్ కలకలంతో ప్రపంచలోని పలు దేశాలు ఆంక్షలకు దిగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో రోజుకి సగటున 3 వేల కేసులొస్తున్నాయి. వీటిలో ఒమిక్రాన్‌ కేసులెన్ని అనేది జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అమెరికా, బ్రెజిల్, కెనడా, జపాన్, థాయిలాండ్, యూరోపియన్‌ యూనియన్, యూకే తదితర దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షల విధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌ లాంటి చిన్న దేశలు కూడా ఆఫ్రికా దేశాలకు విమాన రాకపోకలను రద్దు చేశాయి. మరోవైపు యూకేలో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు వచ్చాయి. జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌లోనూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Smart Substations : ఏపీలో స్మార్ట్ సబ్ స్టేషన్లు.. ఉద్యోగులు లేకుండానే విద్యుత్‌ సరఫరా

దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌కు వచ్చిన రెండు విమానాల్లో 600 మంది ప్రయాణికుల్లో 61 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జీన్‌ సీక్వేసింగ్‌కు పంపారు. ఇక ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపించడంతో పాటు సులువుగా జన్యు ఉత్పరివర్తనాలకు లోనయ్యేలా ఉందని అమెరికా ప్రభుత్వ ప్రధాన వైద్యరంగ సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. దక్షిణాఫ్రికా వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్నారు.

50 మ్యుటేషన్లు, స్పైక్ ప్రొటీన్‌లోనే 30 కన్నా ఎక్కువ మ్యుటేషన్లు కనిపించడంతో ఇప్పుడు ప్రపంచదేశాల గుండెల్లో రైళ్లు పరగిగేడుతున్నాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఆందోళన పరిచే మరో విషయమేంటంటే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లోనే 10 మ్యుటేషన్లు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే మ్యుటేషన్లు కనిపించాయి. దీంతో ఈ వేరియంట్‌తో ముప్పు తప్పేలా లేదంటూ ప్రపంచదేశాలు భయపడుతున్నాయి.